యాదగిరిగుట్టలో కొబ్బరికాయ రూ.50 కి అమ్ముకునేలా అనుమతి ఇవ్వండి : వర్తక సంఘం సభ్యులు

యాదగిరిగుట్టలో కొబ్బరికాయ రూ.50 కి అమ్ముకునేలా అనుమతి ఇవ్వండి : వర్తక సంఘం సభ్యులు
  • ఆలయ ఈవో వెంకటరావుకు వినతిపత్రం ఇచ్చిన వర్తక సంఘం సభ్యులు

యాదగిరిగుట్ట, వెలుగు: యాదగిరిగుట్టలో కొండపైన భక్తులకు కొబ్బరికాయ రూ.50 కు అమ్ముకునేలా అనుమతి ఇవ్వాలని యాదగిరిగుట్ట వర్తక సంఘం అధ్యక్షుడు గడ్డమీది మాధవులు గౌడ్ ఆధ్వర్యంలో వర్తక సంఘం సభ్యులు ఈవో వెంకటరావును కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాధవులు గౌడ్ మాట్లాడుతూ..  బయటి మార్కెట్ లో కొబ్బరికాయల రేట్లు విపరీతంగా పెరిగిపోయిన కారణంగా.. కొండపైన భక్తులకు రూ.40కే కొబ్బరికాయలు అమ్మడం వల్ల తాము నష్టపోతున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు.  

వర్తక సంఘానికి కేటాయించిన మూడు షాపులకు దేవస్థానానికి నెలకు రూ.4 లక్షల కిరాయి చెల్లిస్తున్నామని తెలిపారు. ఆలయ అధికారులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఈవో చెప్పినట్లు పేర్కొన్నారు.  వర్తక సంఘం కార్యదర్శి ఆకుల నర్సింహులు, కోశాధికారి నరసింహ, సభ్యులు కొన్నె రమేశ్, రాజు, తడక వెంకటేష్ తదితరులు ఉన్నారు.