యాదవ కార్పొరేషన్​ పెట్టండి.. కాంగ్రెస్​కు యాదవ పోరాట హక్కుల సమితి వినతి

యాదవ కార్పొరేషన్​ పెట్టండి.. కాంగ్రెస్​కు యాదవ పోరాట హక్కుల సమితి వినతి

హైదరాబాద్, వెలుగు: గొల్ల కురుమల కోసం యాదవ కార్పొరేషన్​ను ఏర్పాటు చేయాలని కాంగ్రెస్​ పార్టీని యాదవ హక్కుల పోరాట సమితి కోరింది. గురువారం యాదవ పోరాట సమితి అధ్యక్షుడు వంశీ మోహన్​ ఆధ్వర్యంలో సమితి సభ్యులు కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ చైర్మన్​ శ్రీధర్​ బాబును కలిసి విజ్ఞప్తి చేశారు. వచ్చే ఎన్నికల్లో సీట్ల కేటాయింపుల్లో యాదవులకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. 

1955 నుంచి 1970 వరకు అమల్లో ఉన్న స్పెషల్​ నొమాడిక్​ ట్రైబ్​ రిజర్వేషన్లను అమలు చేసే అంశాన్ని మేనిఫెస్టోలో చేర్చాలన్నారు. రెండో విడత గొర్రెల పంపిణీకి సంబంధించిన డబ్బును ఆన్​లైన్​లో ట్రాన్స్​ఫర్​ చేస్తామంటూ హామీ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.