యాదగిరిగుట్ట, వెలుగు : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి హుండీల ద్వారా వచ్చిన ఆదాయాన్ని ఆలయ అధికారులు గురువారం లెక్కించారు. 28 రోజులకు గానూ హుండీలను లెక్కించగా... మొత్తం రూ.2,78,13,079 ఆదాయం సమకూరింది. అలాగే 708 గ్రాముల బంగారం, 3.150 కిలోల వెండి వచ్చినట్లు ఈవో భవానీ శంకర్ తెలిపారు. 750 అమెరికన్ డాలర్లు, 20 ఇంగ్లాండ్ పౌండ్లు, 50 కెనడా డాలర్లు, 1.04 లక్షల వియత్నాం కరెన్సీతో పాటు నేపాల్ కెరన్సీ, ఆస్ట్రేలియా, శ్రీలంక, మలేషియా, సౌదీ, ధాయ్ లాండ్, సింగపూర్, కంబోడియా, ఖతార్, న్యూజిలాండ్, యూరో, ఫిలిప్పైన్స్ దేశాలకు చెందిన కరెన్సీ వచ్చినట్లు వెల్లడించారు. మరోవైపు గురువారం జరిగిన పూజలు, నిత్య కైంకర్యాల ద్వారా రూ.16,57,370 ఆదాయం వచ్చినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు.
