వంద మందిని చంపే యక్షిణి కథ

వంద మందిని చంపే యక్షిణి కథ

వేదిక లీడ్‌ రోల్‌లో మంచు లక్ష్మి, రాహుల్ విజయ్, అజయ్ కీలక పాత్రల్లో తేజ మార్ని తెరకెక్కించిన వెబ్ సిరీస్ ‘యక్షిణి’. శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని నిర్మించారు. జూన్ 14 నుంచి డిస్నీ ప్లస్‌‌‌‌ హాట్ స్టార్‌‌‌‌‌‌‌‌లో ఇది స్ట్రీమింగ్ కానుంది. శుక్రవారం ట్రైలర్‌‌‌‌‌‌‌‌ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. వేదిక మాట్లాడుతూ ‘ఈ వెబ్ సిరీస్‌‌‌‌తో డిజిటల్ ఎంట్రీ ఇవ్వడం సంతోషంగా ఉంది. స్క్రిప్ట్ లో చాలా షేడ్స్..క్యారెక్టర్స్‌‌‌‌లో ఎంతో డెప్త్, వేరియేషన్ ఉన్నాయి’ అని చెప్పింది. ‘విరూపాక్ష’ తర్వాత మాంత్రికుడి పాత్రలు చాలా వచ్చాయి.

కానీ అవన్నీ రిజెక్ట్ చేశాను. దానికి కాస్త దగ్గరగా ఉన్న పాత్రను ఇందులో పోషించాను’ అని అజయ్ అన్నాడు. మంచు లక్ష్మి మాట్లాడుతూ ‘ఇందులో జ్వాల పాత్రలో కనిపిస్తా. స్క్రిప్ట్ చదివినప్పుడు ఈ పాత్ర నేను తప్ప మరెవరు చేస్తారు అనిపించింది’ అని చెప్పారు. ‘విజయం పట్ల పూర్తి నమ్మకంతో ఉన్నాం’ అన్నాడు రాహుల్ విజయ్. దర్శకుడు మాట్లాడుతూ

‘ఒక శాపం వల్ల భూమ్మీదకు వచ్చిన యక్షిణికి వంద మందిని చంపితేగానీ శాపవిముక్తి కాదు. వాళ్లను ఎలా చంపింది. వందో వ్యక్తి ఎవరు అనేది మెయిన్ కాన్సెప్ట్‌‌‌‌’ అని చెప్పాడు. రొమాన్స్, కామెడీ, డ్రామా లాంటి అంశాలతో ఇది ఆకట్టుకుంటుందని, సీజన్‌‌‌‌ 2 కోసం ప్లానింగ్ మొదలుపెట్టామని నిర్మాత ప్రసాద్ దేవినేని చెప్పారు.