యమధీర మూవీ టీజర్‌‌‌‌ రిలీజ్

 యమధీర మూవీ టీజర్‌‌‌‌ రిలీజ్

కన్నడ హీరో కోమల్ కుమార్ హీరోగా, ఇండియన్ క్రికెటర్ శ్రీశాంత్ నెగిటివ్ రోల్‌‌లో నటించిన చిత్రం ‘యమధీర’.  ఆర్ శంకర్ దర్శకత్వంలో వేదాల శ్రీనివాస్ నిర్మించారు. షూటింగ్ పూర్తయి, త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తాజాగా ఈ మూవీ టీజర్‌‌‌‌ను అశోక్ కుమార్ రిలీజ్ చేసి టీమ్‌‌కు బెస్ట్‌‌ విషెస్ చెప్పారు. 

ఈ సందర్భంగా ప్రొడ్యూసర్ వేదాల శ్రీనివాస్ మాట్లాడుతూ ‘సినిమాలపై ప్యాషన్‌‌తో ప్రొడక్షన్ స్టార్ట్ చేశా. కన్నడ హీరో కోమల్ సహా టీమ్ అంతా చాలా సపోర్ట్ చేశారు’ అని చెప్పారు.  నాగబాబు, ఆలీ, సత్య ప్రకాష్,  మధు సూధన్ ఈ చిత్రంలో కీలకపాత్రలు పోషించారు.