తీరంవైపు కదులుతున్న యాస్ తుపాన్.. తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన

తీరంవైపు కదులుతున్న యాస్ తుపాన్.. తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన

యాస్ తుపాన్ తీరంవైపు కదులుతోంది. ప్రస్తుతం వాయుగుండంగా కదులుతున్న తుపాన్ సోమవారం ఉదయానికి తుపానుగా బలపడుతుందని వాతావరణశాఖ అంచనా. ఈ యాస్ తుపాను ప్రభావంతో రాగల 24 గంటల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. ప్రస్తుతం ఒడిశాలోని పారాదీప్ కు తూర్పు ఆగ్నేయ దిశలో 480 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతం అయి ఉంది. అలాగే బాలాసోర్ కు దక్షిణ ఆగ్నేయ దిశలో 470 కిలోమీటర్ల దూరంలో.. పశ్చిమ బెంగాల్లోని దిఘాకు 560 కిలోమీటర్ల దూరంలో కదులుతోంది. ఈ వాయుగుండం ఇవాళ రాత్రికి తీవ్ర వాయుగుడం నుంచి రేపు సోమవారం ఉదయానికంతా మరింత బలపడి తుపానుగా మారుతుందని వాతావరణశాఖ ప్రకటించింది. ఈ యాస్ తుపాన్ ఈనెల 26న సాయంత్రం ఒడిశాలోని పారాదీప్.. పశ్చిమ బెంగాల్ లోని సాగర్ ద్వీపాల మధ్య తీరం దాటే అవకాశం ఉందని. ఇది తీరం దాటే సమయంలో గంటకు 150 కిలోమీటర్ల వేగంతో భారీగా ఈదురు గాలులు వీస్తాయని.. వర్షం కుండపోతగా కురుస్తుందని వాతావరణశాఖ ప్రకటించింది.