సాలార్ లో యశ్ స్పెషల్ గెస్ట్

సాలార్ లో యశ్  స్పెషల్ గెస్ట్

ఒకరు ప్యాన్ వరల్డ్ స్టార్. మరొకరు ఒకే ఒక్క ఫ్రాంచైజీతో ప్యాన్ ఇండియా స్థాయిలో సెన్సేషన్ క్రియేట్ చేసిన స్టార్. ఈ ఇద్దరూ కలిసి నటిస్తే చూడాలని అందరికీ ఉంటుంది కదా! అందుకే ప్రభాస్, యశ్‌‌ కలిసి ఓ మల్టీస్టారర్ మూవీ చేయనున్నారంటూ రీసెంట్‌‌గా వచ్చిన వార్త అందరిలోనూ జోష్‌‌ను నింపింది. అయితే ఇప్పుడా న్యూస్‌‌లో కొత్త ట్విస్ట్ వచ్చింది. వీళ్లిద్దరూ కలిసి ఏ సినిమా చేయట్లేదట. కానీ కలిసి స్క్రీన్‌‌పై కనిపిస్తారట. ఎందుకంటే ‘సాలార్‌‌‌‌’లో యశ్‌‌ ఓ గెస్ట్ రోల్ చేయనున్నాడట. కొద్ది నిమిషాల పాటు మాత్రమే అతనా సినిమాలో ఉంటాడట. కానీ ఆ సీన్స్ ఓ రేంజ్‌‌లో ఉంటాయని టాక్. ఈ ఇద్దరు హీరోలు కలిసి స్క్రీన్‌‌పై కనిపిస్తే మాత్రం ఇక ఫ్యాన్స్‌‌కి పూనకాలే.  రెండు డిఫరెంట్ కాలాల్లో సాగే ఈ మూవీలో రెండు రకాల పాత్రల్లో కనిపించబోతున్నాడు ప్రభాస్. పృథ్విరాజ్ సుకుమారన్‌‌ విలన్‌‌గా నటిస్తున్నాడు. జగపతిబాబు కీలక పాత్ర పోషిస్తున్నాడు. శ్రుతీ హాసన్ హీరోయిన్. ఇప్పుడు యశ్ కూడా యాడ్ అయితే కనుక అంచనాలు రెట్టింపవడం ఖాయం.