యశోదా హాస్పిటల్​లో 50 రోబోటిక్ సర్జరీలు

యశోదా హాస్పిటల్​లో 50 రోబోటిక్ సర్జరీలు

హైదరాబాద్, వెలుగు :  యశోదా హాస్పిటల్స్  కేవలం 45 రోజుల్లో 50 రోబోటిక్ సర్జరీలను  విజయవంతంగా పూర్తిచేసింది. సోమాజిగూడ యశోద హాస్పిటల్స్ సీనియర్ ఆర్థోపెడిక్ & రోబోటిక్ సర్జన్ డాక్టర్ సునీల్ దాచేపల్లి, ఆయన బృందాన్ని యశోదా హాస్పిటల్స్ గ్రూప్ డైరెక్టర్  డాక్టర్ పవన్ గోరుకంటి అభినదించారు. ఈ సందర్భంగా పవన్   మాట్లాడుతూ... ఓపెన్‌ సర్జరీలను ల్యాప్రోస్కోపిక్‌ సర్జరీలు అధిగమించాయని, ఇవి కీ హోల్‌ సర్జరీలు కాబట్టి కోలుకునే సమయాలు తగ్గాయని అన్నారు.

‘‘ల్యాప్రోస్కోపిక్‌ సర్జరీల్లో కూడా ఇటు డాక్టర్లకు, అటు రోగులకు కొన్ని ఇబ్బందులు ఉంటూనే ఉంటాయి. ఈ ఇబ్బందులను అధిగమిస్తూ రోబోటిక్‌ సర్జరీలు అందుబాటులోకొచ్చాయి. ల్యాప్రోస్కోపిక్‌ సర్జరీతో పోలిస్తే, రోబోటిక్‌ సర్జరీలపై డాక్టర్లకు పట్టు ఎక్కువగా ఉంటుంది. అత్యాధునిక రోబోటిక్ విధానాలతో సంక్లిష్టమైన సర్జరీలను కూడా మరింత సులభంగా కచ్చితత్వంతో నిర్వహించడం వీలవుతుంది. రోగులకు సాధ్యమైనంత ఉత్తమమైన ఫలితాలను ఇవ్వవచ్చు. అత్యాధునిక మెడికల్​ టెక్నాలజీలను తేవడానికి యశోద హాస్పిటల్స్ ఎల్లప్పుడూ కృషి చేస్తుంది”అని తెలిపారు.  

రోబోటిక్ సర్జరీ వల్ల కలిగే ప్రయోజనాలు, రోబోటిక్ సర్జరీ  కచ్చితత్వం  గురించి డాక్టర్ సునీల్ వివరించారు. రోబోటిక్ సర్జరీ తరువాత పేషెంట్ ఆసుపత్రిలో ఉండే సమయం తగ్గుతుందని, అనేక ప్రయోజనాలు ఉంటాయని పేర్కొన్నారు. తక్కువ సమయంలో నొప్పి తగ్గుతుందని, వేగంగా కోలుకోవచ్చని (మెజారిటీ కేసుల్లో కేవలం నాలుగు గంటలు)  అన్నారు. ప్రతి ఒక్కరూ  కీళ్ళు,  మోకాళ్ల మార్పిడి కోసం సంప్రదాయ ఆపరేషన్ల కంటే రోబోటిక్ సర్జరీలను ఎంచుకోవాలని సూచించారు.