-Out-now_n0OyEe8YdV.jpg)
టాలీవుడ్ బ్యూటీ సమంత ప్రస్తుతం హరి–హరీష్ దర్శకత్వంలో 'యశోద' మూవీ చేస్తోంది. ఈ సినిమా నవంబర్ 11న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయబోతోంది. తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ను మేకర్స్ వదిలారు. తెలుగు ట్రైలర్ ను రౌడీ హీరో విజయ్ దేవరకొండ లాంచ్ చేశాడు.
ట్రైలర్ విషయానికొస్తే.. ‘మీకెప్పుడైనా రెండు గుండె చప్పుళ్లు వినిపించాయా..? బిడ్డను కడుపులో మోస్తున్న తల్లికి మాత్రమే అది వినిపిస్తుంది..’ అని సమంత డైలాగ్స్‌తో ట్రైలర్ మొదలైంది. నువ్వు కనే బిడ్డ ఏ బిలియనీర్ ఇంటికో వెళ్తుందని వరలక్ష్మి శరత్‌కుమార్ చెబుతుంది. ‘యశోద ఎవరో తెలుసు కదా.. ఆ కృష్ణ పరమాత్ముడిని పెంచిన తల్లి’ అంటూ సమంత చివరలో చెప్పిన డైలాగ్స్ ఆసక్తినిరేపుతున్నాయి.
సస్పెన్స్ థ్రిలర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాపై ట్రైలర్ తో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రం కన్నడ, మలయాళ, తమిళం, హిందీ భాషల్లో విడుదల కానుంది. శ్రీదేవి మూవీస్ బ్యానర్ పై శివలెంక కృష్ణప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో రావు రమేష్, వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించారు.