
కాకినాడ: తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో దారుణం జరిగింది. కాకినాడలోని 9వ వార్డు కార్పొరేటర్, వైసీపీ నేత కంపరా రమేష్ దారుణ హత్యకు గురయ్యాడు. పాత కక్షలు కారణంగా హత్య చేసి ఉంటారని పోలీసులు విచారణ నిర్వహిస్తున్నారు. పోస్ట్ మార్టమ్ కోసం కాకినాడ ట్రస్ట్ హాస్పిటల్‌కి మృతదేహాన్ని తరలించిన పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. సీసీ పుటేజీ ఆధారంగా నిందితులను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు పోలీసులు. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.