
టీడీపీ చీఫ్ , మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సంచలన కామెంట్స్ చేశారు. ట్విట్టర్ వేదికగా తీవ్రంగా స్పందించారు. ఏపీ సీఎంపై నిప్పులు చెరిగారు. వైఎస్సార్ సీపీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలదంతా నేర చరిత్రేనని ఆరోపించారు. వారిపై మొత్తం 408 క్రిమినల్ కేసులు ఉన్నాయని ఆరోపించారు. రాష్ట్రానికి సీఎంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఏకంగా 11 సీబీఐ కేసులు, తొమ్మిది ఈడీ కేసులు కలుపుకొని మొత్తం 31 క్రిమినల్ కేసులు ఉన్నాయని ట్వీట్ చేశారు చేశారు నారా చంద్రబాబు నాయుడు.
వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ న్యాయ ఖర్చులు 70 శాతం పెరిగాయని ఆరోపించారు. ఇదంతా కేవలం మచ్చుకు మాత్రమే నంటూ.. దీని వల్ల ప్రజాధనం దుర్వినియోగం జరుగుతోందని మండిపడ్డారు. ఇలాంటి క్రిమినల్స్ న్యాయమైన పరిపాలన ఎలా చేస్తారు? అంటూ ప్రశ్నిస్తూ ట్వీట్ చేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. మునుపెన్నడూ లేని విధంగా ఐపీఎస్, ఐఏఎస్ లు సైతం న్యాయస్థానాలలోచివాట్లు తినడమే కాదు, శిక్షలు కూడా వేయించుకున్నారు. రాష్ట్రంలో రాచరిక పాలన సాగుతోందని ధ్వజమెత్తారు. ప్రజా సంక్షేమాన్ని గాలికి వదలేశారని, పాలన అస్తవ్యస్తంగా మారిందని మండిపడ్డారు. ప్రజలు మార్పు కోరుకుంటున్నారని త్వరలోనే అది వాస్తవ రూపం దాల్చుతుందని స్పష్టం చేశారు. తాము అధికారంలోకి రావడం ఖాయమన్నారు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.