వైసీపీ మాజీ ఎమ్మెల్యే బానోతు మదన్‌లాల్‌ కన్నుమూత..

వైసీపీ మాజీ ఎమ్మెల్యే బానోతు మదన్‌లాల్‌ కన్నుమూత..

వైరా మాజీ ఎమ్మెల్యే బానోతు మదన్ లాల్ కన్నుమూశారు. మంగళవారం ( మే 27 ) హైదరాబాద్ లోని ఏఐజీ హాస్పిటల్లో గుండెపోటుతో మరణించారు. నాలుగు రోజుల క్రితం అస్వస్థతో ఆసుపత్రిలో చేరిన ఆయన ఇవాళ మరణించినట్లు సమాచారం. ఖమ్మంలోని ఆయన నివాసంలో వాంతులు విరేచనాలతో స్థానిక ఆసుపత్రిలో చేరిన ఆయన మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ ఏఐజీ హాస్పిటల్లో చేరినట్లు సమాచారం. 

మదన్ లాల్ మృతితో వైరా నియోజకవర్గంలో విషాదఛాయలు నెలకొన్నాయి. మదన్ లాల్ మృతి పట్ల పలువురు బీఆర్ఎస్ నేతలు, ఇతర పార్టీల నేతలు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. 

2014 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ తరపున వైరా నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు మదన్ లాల్. ఆ తర్వాత బీఆర్‌ఎస్‌ పార్టీలో చేరిన మదన్ లాల్ 2018, 2023 ఎన్నికల్లో ఓటమి చవిచూశారు. అనంతరం వైరా బీఆర్‌ఎస్‌ నియోజకవర్గ ఇన్‌చార్చిగా వ్యవహరిస్తున్నారు మదన్ లాల్.