
స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు నాయుడుకు ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీంతో న్యాయం గెలిచింది అంటూ టీడీపీ నేతలు సంబరాలు చేసుకుంటున్నారు. ఈ అంశాలపై మంత్రి అంబటి రాంబాబు సెటైర్లు వేశారు. చంద్రబాబుకు ప్రత్యేక పరిస్థితుల్లో బెయిల్ ఇచ్చారని.. దీనిపై టీడీపీ నేతలు చాలా హంగామా చేస్తున్నారు అంటూ సెటైర్లు వేశారు. నిజం గెలిచింది అంటున్నారు కానీ ఇంకా నిజం గెలవలేదు..కేసు దర్యాప్తు కొనసాగుతోంది. మధ్యంతర బెయిల్ కే ఈ మాత్రం దానికే ఇంత హంగామానా..? అంటూ ప్రశ్నించారు.
చంద్రబాబుకు ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా బెయిల్ ఇచ్చారని..గతంలో ఏసి ప్రొవైడ్ చేయమని రిలీఫ్ ఇచ్చారని అన్నారు.మానవతా దృక్పథంతో ఇచ్చిన బెయిల్ మాత్రమే అని అన్నారు.కంటి ఆపరేషన్ చేయించుకొని తర్వాత జైల్లో హాజరుకావాల్సి ఉందని ఈ మాత్రం దానికే సంబరాలు చేసుకుంటున్నారు అంటూ ఎద్దేవా చేశారు. న్యాయం, ధర్మం గెలిచిందని మాట్లాడటం సమంజసం కాదు..రెచ్చగొట్టే విధంగా మాట్లాడటం కరెక్ట్ కాదన్నారు.ఈ కేసులో నిర్దోషి అని చంద్రబాబుకు బెయిల్ ఇవ్వలేదు.. అనారోగ్య కారణాలతో మాత్రమే హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చిందన్నారు మంత్రి అంబటి.. డాక్టర్ లు ఇచ్చిన నివేదిక ప్రకారం చికిత్స కోసం మాత్రమే చంద్రబాబు కు బెయిల్ వచ్చింది.. కంటి వైద్య కోసం మానవతా దృక్పథంతో కోర్టు బెయిల్ ఇచ్చిందన్న ఆయన.. యుద్ధం ఇప్పుడే మొదలైందని నారా లోకేష్ అనడం ఆశ్చర్యంగా ఉందన్నారు.. ఈ కేసులో చాలా విచారణ మిగిలే ఉంది.. విదేశాలకు పారిపోయిన నిందితులను తీసుకు వచ్చి విచారణ చేయించాలన్నారు
నిజం గెలిచి కాదు
— Ambati Rambabu (@AmbatiRambabu) October 31, 2023
బాబుకు కళ్ళు కనిపించడం లేదు అని మధ్యంతర బెయిల్!
Also Read :- హిందీలో రీమేక్ అవుతున్న బేబీ.. హీరోగా చేస్తున్న స్టార్ హీరో కొడుకు