ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీకి అమ్ముడుపోయారు : జోగి రమేష్

ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీకి అమ్ముడుపోయారు : జోగి రమేష్

చంద్రబాబుకు కొందరు ఎమ్మెల్యేలు తొత్తుగా మారుతున్నారని వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ అన్నారు.  ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీకి అమ్ముడుపోయారని ఆయన ఆరోపించారు.  ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ పై చర్చించి ఎవరు తప్పు చేశారో తెలుస్తామన్నారు.  క్రాస్ ఓటింగ్ వేసిన ఆ  ఇద్దరు ఎమ్మెల్యేలు ప్రజాభిమానం లేని వారని అన్నారు. వాళ్లకు ఇక రాజకీయ జీవితం ఉండదంటూ తీవ్రంగా మండిపడ్డారు.  ఆ ఇద్దరు ఎమ్మెల్యేలకు ఇది బ్లాక్ డే అని విమర్శించారు. చంద్రబాబుకు ఇది విజయం కాదన్న  జోగి రమేష్...  ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు తమ పార్టీని ఏ మాత్రం ప్రభావితం చేయవని  చెప్పుకొచ్చారు. రేపు వైసీపీ ప్రభంజనంలో టీడీపీ తుడిచి కొట్టుకుపోవడం ఖాయమని చెప్పారు.  


ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి అయిన  పంచుమర్తి అనురాధ గెలుపొందారు. 23 ఓట్లతో ఆమె గెలుపొందారు. 19 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పటికి 23 ఓట్లతో అనుహ్యంగా  గెలిచారు.  అయితే ఈ ఎన్నికల్లో  వైసీపీ నుంచి క్రాస్ ఓటింగ్ జరిగినట్లుగా తెలుస్తోంది. అటు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అనుహ్యంగా  3 స్థానాల్లో విజయం సాధించింది. ఈ విజయం మరిచికపోకముందే టీడీపీ సత్తా చాటింది. మరోవైపు టీడీపీ నేతలు, కార్యకర్తలు సంబరాల్లో మునిగిపోయారు. మెజార్టీకి అవసరమైన ఎమ్మెల్యేలు లేకపోయినా పార్టీ గెలవడంపై ఖుషి అవుతున్నారు