అధికారులు పట్టించుకోవట్లేదని వైసీపీ ఎమ్మెల్యే నిరసన

అధికారులు పట్టించుకోవట్లేదని వైసీపీ ఎమ్మెల్యే నిరసన

నెల్లూరు జిల్లాలో మురుగు కాలువలో బైఠాయించి నిరసన తెలిపారు అధికారపార్టీ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి. ప్రతిపక్షమైనా, అధికార పక్షమైనా సమస్యలను పరిష్కారించడంలో రాజీ పడేది లేదన్నారు. రైల్వే, మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యంతో కాలనీ వాసులు మురుగు నీటితో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారంటూ ఫైర్ అయ్యారు. సమస్యను పరిష్కరించే వరకు అక్కడి నుంచి కదలనన్నారు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. గతంలో దీనిపై ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా ఎన్నోసార్లు ప్రశ్నించానన్నారు. మూడేళ్ల నుంచి అధికారులతో మాట్లాడుతున్నాన్నారు. అధికారులు పట్టించుకోకపోవడంతో ధర్నాకు దిగారు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి.