
చంద్రబాబు నాయుడు.. హత్యా రాజకీయాలకు మారు పేరన్నారు వైసీపీ ఎమ్మెల్యే రోజా. అధికారం కోసం చంద్రబాబు ఎంతకైనా తెగిస్తారన్నారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రోజా… వైయస్ వివేకానంద రెడ్డి హత్య వెనుక టీడీపీ ఉందనే అనుమానం వ్యక్తం చేశారు. ఒక సీనియర్ నాయకుడి హత్య జరిగితే హుందాగా వ్యవహరించాల్సిన చంద్రబాబు….. చీప్ కామెంట్స్ చేశారని మండిపడ్డారు. జగన్ ను మానసికంగా కుంగదీయాలనే ఇలాంటి కుట్రలు చేస్తున్నారన్నారు రోజా.