లోక్ సభలో నిందితుడిని పట్టుకున్న వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్

లోక్ సభలో నిందితుడిని పట్టుకున్న వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్

లోక్ సభలో ఇద్దరు అగంతకులు కలర్ స్ప్రే కొట్టడం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. విజిటర్స్ చాంబర్ లో నుంచి సభలోకి దూసుకొచ్చిన ఇద్దరు నిందితులు సాగర్ శర్మ, మనోరంజన్  ఎంపీలు కూర్చున్న బల్లలపైకి ఎక్కి కాసేపు హంగామా సృష్టించారు. షూలో దాచిన స్ప్రే కొట్టి హడావుడి సృష్టించారు. పారిపోయేందుకు ప్రయత్నించగా నిందితులను   కొందరు ఎంపీలు  పట్టుకుని సిబ్బందికి అప్పగించారు. 

అయితే మన తెలుగు ఎంపీ ఏపీకి చెందిన గోరంట్ల  మాధవ్ నిందితుడిని పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించారు. మాధవ్ ఇతర ఎంపీలతో కలిసి పట్టుకున్నారు. అగంతకుడికి ఎదురు టేబుల్స్ పై నుంచి వచ్చిన గోరంట్ల మాధవ్ నిందితుడిని పట్టుకున్నారు. దీంతో ఎంపీ మాధవ్ పై  ప్రశసంలు వస్తున్నాయి.  గతంలో మాధవ్ సీఐగా పనిసిన అనుభవం ఉపయోగపడిందని కితాబిస్తున్నారు.

 సెన్సేషన్ సృష్టించాలనే ప్రయత్నంలో భాగంగానే లోక్ సభలో  దాడి చేశారని మీడియాకు చెప్పారు ఎంపీ గోరంట్ల మాధవ్. నేరస్థులు చాలా స్మార్ట్ గా తయారవుతున్నారని.. వాటికి అనుగుణంగా మార్పులు అడప్ట్ చేసుకోవాలన్నారు.  దేశానికి వ్యతిరేకంగా నినాదాలు చేసే యత్నం చేసిన  వారిని అడ్డుకున్నామని చెప్పారు.సెక్యూరిటీని మరింత మెరుగుపరచాలన్నారు ఎంపీ మాధవ్.