ఏపీ లిక్కర్ కేసు : వైసీపీ ఎంపీ మిధున్ రెడ్డికి బెయిల్

ఏపీ లిక్కర్ కేసు : వైసీపీ ఎంపీ మిధున్ రెడ్డికి బెయిల్

MP Midhun Reddy Bail: లిక్కర్ కేసులో అరెస్ట్ అయ్యి.. రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మిధున్ రెడ్డికి బెయిల్ ఇచ్చింది ఏసీబీ కోర్టు. 2025, సెప్టెంబర్ 29వ తేదీ.. ఈ కేసులో విచారణ చేసిన ఏసీబీ కోర్టు.. షరులతో బెయిల్ మంజూరు చేసింది. వారంలో రెండు రోజులు ఏసీబీ కోర్టుకు హాజరుకావాలనే కండీషన్ కింద బెయిల్ ఇస్తూ ఆదేశాలు జారీ చేశారు జడ్జి. 

ఏపీ లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన ఎంపీ మిధున్ రెడ్డి.. 71 రోజులు జైలులో ఉన్నారు. ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేయటానికి మధ్యంతర బెయిల్ ఇచ్చింది కోర్టు. ఆ తర్వాత ఆయన మళ్లీ జైలుకు వెళ్లారు. లిక్కర్ కేసులో 2025, జూలై 19వ తేదీన విజయవాడలోని సిట్ ఆఫీసుకు విచారణ కోసం వచ్చారు. ఏడు గంటల సుదీర్ఘ విచారణ తర్వాత.. సరైన సమాధాలు చెప్పలేదని.. లిక్కర్ స్కాంలో ఎంపీ మిధున్ రెడ్డి పాత్రపై స్పష్టమైన ఆధారాలు ఉన్నాయంటూ అరెస్ట్ చేశారు అధికారులు. అక్కడి నుంచి కోర్టులో హాజరుపరిచి.. ఆ తర్వాత రిమాండ్ కింద రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు అధికారులు. 

ALSO READ : తమిళ నటుడు విజయ్ ఇంటికి బాంబు బెదిరింపు..

పలుసార్లు బెయిల్ పిటీషన్ డిస్మస్ అయ్యింది. ఛార్జిషీటు ఇంకా దాఖలు చేయకపోవటంతో ఏసీబీ కోర్టు షరతులతో బెయిల్ ఇచ్చింది. సెప్టెంబర్ 30వ తేదీ మంగళవారం ఆయన జైలు నుంచి విడుదల అయ్యే అవకాశం ఉంది.