డబుల్​ ఇండ్లపై మంత్రి గంగులను నిలదీసిన పేదలు

డబుల్​ ఇండ్లపై మంత్రి గంగులను నిలదీసిన పేదలు

డబుల్​ ఇండ్లపై మంత్రి గంగులను నిలదీసిన పేదలు

కొత్తపల్లి, వెలుగు: కరీంనగర్​ జిల్లా కొత్తపల్లి మండలం ఎలగందల్​ గ్రామంలో డబుల్​బెడ్రూం ఇండ్ల పంపిణీలో మంత్రి గంగుల కమలాకర్​కు చేదు అనుభవం ఎదురైంది. ఎలగందల్​లో నిర్మించిన 20 డబుల్ బెడ్రూం ఇండ్లను లబ్ధిదారులకు ఆదివారం మంత్రి పంపిణీ చేశారు. ఓ లబ్ధిదారురాలికి మంత్రి డబుల్ బెడ్రూం ఇంటి పట్టా అందిస్తుండగా గతంలో ఇచ్చినవారికే మళ్లీ ఇస్తున్నారంటూ అధికార పార్టీకి చెందిన మాజీ ఎంపీటీసీ గుర్రాల చంద్రయ్య అడ్డుకున్నారు. మంత్రి హోదాలో ఉన్న మీరు అసలైన లబ్ధిదారులకు అందించకుండా గతంలో ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిన వారికే మళ్లీ ఇవ్వడమేంటని ప్రశ్నించారు. వెంటనే తేరుకున్న స్థానిక నాయకులు అతడిని పక్కకు లాక్కెళ్లారు. అనంతరం పలువురు నిరుపేదలు మా సంగతేంటి సారూ..  అంటూ మంత్రి గంగుల కమలాకర్​ను ప్రశ్నించారు. గతంలో ఇందిరమ్మ ఇండ్లు వచ్చినవారికి మళ్లీ ఇప్పుడు ఇచ్చారని.. లేని వాళ్లకు అసలే ఇవ్వలేదని, తమ గ్రామంలో మరో 30 మంది లబ్ధిదారులకు ఇళ్లు రావాల్సి ఉందని చెప్పారు. మా సంగతేమిటని ఆందోళన చేపట్టగా ఇల్లు రానివాళ్ల జాబితా ఇస్తే రెండో విడతలో ఇస్తామని మంత్రి సర్దిచెప్పారు. అయినా వారు వినిపించుకోకుండా కాన్వాయ్​ను అడ్డుకోవడానికి ప్రయత్నించగా పోలీసులు వారిని పక్కకు తీసుకెళ్లారు.