ఇల్లందులో అసమ్మతి గళం.. బుజ్జగిస్తున్న ఎమ్మెల్యే హరిప్రియ

ఇల్లందులో అసమ్మతి గళం.. బుజ్జగిస్తున్న ఎమ్మెల్యే హరిప్రియ

సిట్టింగులకే సీట్లు ఇవ్వడంతో కొన్ని చోట్ల బీఆర్ఎస్లో అసమ్మతి రాజుకుంటోంది. నియోజకవర్గాల్లో సెకండ్ క్యాడర్ నేతలు ఎమ్మెల్యేలపై అసంతృప్తి వెల్లగక్కుతున్నారు. లేటెస్ట్ గా  భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ పై నియోజకవర్గంలోని కొందరు అసమ్మతి నేతలు  మంత్రి హరీశ్ రావుకు ఫిర్యాదు చేశారు. ఆమెకు  ఎమ్మెల్యే టికెట్ ఇవ్వొద్దని కోరారు. దీంతో అలర్ట్ అయిన ఎమ్మెల్యే హరిప్రియా నాయక్ వెంటనే అసమ్మతి నేతలను బుజ్జగించే పనిలో పడింది.  ఈ క్రమంలో హరిప్రియా నాయక్ ఇల్లందు మున్సిపల్ చైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వరరావు ఇంటికి స్వయంగా వెళ్లి  బుజ్జగిస్తున్నారు.

Also Read :- మాదాపూర్ డ్రగ్స్ కేసులో విచారణకు హాజరు కానున్న నిందితులు

గత కొంత కాలంగా మున్సిపల్ కౌన్సిలర్ మధ్య వచ్చిన భేదాభిప్రాయాలతో ఎమ్మెల్యేపై మున్సిపల్ చైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వరరావుకు వ్యతిరేకత పెరిగింది. కొంతమంది కౌన్సిలర్లు తనపై వ్యతిరేకంగా వ్యవహరించిన విషయంలో హరి ప్రియ..  హరి సింగ్ నాయకుల పాత్ర ఉందనుకుని తన సామాజిక వర్గంతో ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారు.   ఈ క్రమంలోనే  ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా మంత్రి హరీష్ రావుకు ఫిర్యాదు చేశారు.  దీంతో ఎమ్మెల్యే హరిప్రియా నాయక్ వారిని బుజ్జగించే పనిలో పడింది.