భూపరిహారం తక్కువ ఇస్తున్నారంటూ రైతుల ఆగ్రహం

భూపరిహారం తక్కువ ఇస్తున్నారంటూ రైతుల ఆగ్రహం

సిద్దిపేట జిల్లా ఎల్లారెడ్డిపేటలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చెక్కుల పంపిణీ కోసం వచ్చిన అధికారులను నిర్వాసితులు పంచాయతీ కార్యాలయంలోనే నిర్వాసితులు దిగ్బంధించారు. మల్లన్నసాగర్ నుంచి దుబ్బాకకు నీటిని తరలించేందుకు కాలువ కోసం అధికారులు భూసేకరణ చేపట్టారు. ఈ కాలువను 20 మీటర్ల వెడల్పుతో నిర్మాణం చేయాలని నిర్ణయించారు.

2013 చట్టం ప్రకారం 31.2 ఎకరాల భూసేకరణ కోసం రైతులకు నోటీసులు ఇచ్చారు. అయితే ఎకరానికి లక్షా 90 వేలు రూపాయలు మాత్రమే ధర నిర్ణయించడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఈమేరకు పరిహారం చెక్కులు రైతులకు ఇచ్చేందుకు వచ్చిన అధికారులను పంచాయతీ ఆఫీసులో బంధించారు. మెరుగైన పరిహారం చెల్లించే వరకు ప్రభుత్వానికి భూములు ఇవ్వబోమని నిర్వాసితులు తేల్చి చెప్పారు.