హైదరాబాద్కు ఎల్లో అలర్ట్.. రాత్రులు జాగ్రత్త

 హైదరాబాద్కు ఎల్లో అలర్ట్.. రాత్రులు జాగ్రత్త

హైదరాబాద్ సిటీకి ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. సహజంగా వానాకాలంలో ఇలాంటివి వింటుంటాం.. ఇప్పుడు చలికాలంలోనూ వెదర్ అలర్ట్ రావటం విశేషం.  దీనికి కారణం.. చలి.. రాత్రి ఉష్ణోగ్రతలు పడిపోవటం అన్నమాట.. హైదరాబాద్ సిటీలో రాబోయే రెండు రోజులు అంటే.. డిసెంబర్ 28వ తేదీ, 29వ తేదీ రాత్రి టెంపరేచర్ గణనీయంగా పడిపోతుందని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది వాతావరణ శాఖ..

చలికాలంలో ఎల్లో అలర్ట్ అంటే.. రాత్రి ఉష్ణోగ్రతలు 10 నుంచి 15 డిగ్రీలకు పడిపోవటం అన్న మాట.. రాబోయే రెండు రోజులు నైట్ వెదర్ చాలా కూల్ గా.. చలా చలిగా ఉంటుందని.. 14, 13 డిగ్రీలు నమోదు అయ్యే అవకాశం ఉందని స్పష్టం చేస్తూ.. ఎల్లో అలర్ట ఇచ్చింది వెదర్ డిపార్ట్ మెంట్. 

తెలంగాణలోని 17 జిల్లాల్లో పొగమంచు బుధవారం అధికంగా ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖతెలిపింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్ధిపేట, యదాద్రి భువనగిరి, రంగారెడ్డి, మేడ్చల్, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో దట్టమైన పొగమంచు కురిసే అవకాశం ఉందని చెప్పింది. 

సీనియర్ సిటిజన్లు, పిల్లలు, రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు వీలైనంత వరకు ఇంట్లోనే ఉండాలని సూచించింది. బయటకు వచ్చే వారు తగిన జాగ్రత్తలు తప్పక తీసుకోవాలని పేర్కొంది.  తెల్లవారుజామున పొగమంచు కారణంగా మూడు రోజుల్లో దాదాపుగా10 మంది మరణించగా పలువురు గాయపడ్డారు.