
యెమన్ లోని జైలుపై సౌదీ అరేబియా వైమానిక దాడికి పాల్పడింది. ఈ ఎయిర్ స్ట్రయిక్ లో దాదాపు 70 మంది ఖైదీలు మృతి చెందారని యెమన్ ఆరోగ్య శాఖ మంత్రి తాహా అల్ ముతావకీల్ తెలిపారు. యెమన్ లో హౌతీ తిరుగుబాటు దళాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జైలును లక్ష్యంగా చేసుకుని సౌదీ అరేబియా దాడికి దిగింది. ఈ ఘటనలో వందలాది మంది గాయపడ్డారు. శుక్రవారం ఉదయం తీరప్రాంత నగరం హొడేయిదాలో వైమానిక దాడి జరిగింది.
సౌదీ ఎయిర్ స్ట్రయిక్స్ తో యెమెన్ లో ఇంటర్నెట్ సేవలకు అంతరాయం ఏర్పడింది. 2014 నుంచి యెమెన్ రాజధాని సనా ప్రాంతం హౌతీ దళాల ఆక్రమణలో ఉంది. సనా ప్రాంతం పైనా సౌదీ వైమానిక దాడికి దిగింది. కాగా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) రాజధాని అబుదాబీపై హౌతీ దళాలు ఇటీవల డ్రోన్, క్షిపణి దాడికి పాల్పడ్డాయి. ఈ దాడిలో ముగ్గురు చనిపోగా.. ఆరుగురు గాయపడ్డారు.
మరిన్ని వార్తల కోసం: