మీరు కూడానా : Yes Bankలో 500 మంది ఉద్యోగుల తీసివేత

మీరు కూడానా : Yes Bankలో 500 మంది ఉద్యోగుల తీసివేత

ప్రముఖ ప్రైవేటు బ్యాంక్ యస్ ఉద్యోగులకు బిగ్ షాకిచ్చింది.  బ్యాంక్ పునర్వ్యవస్థీకరణ ప్రక్రియలో భాగంగా ఖర్చుల తగ్గింపు కోసం 500 మంది ఉద్యోగులను తొలిగించింది. భవిష్యత్తులో మరిన్ని తొలిగింపులు ఉండవచ్చునని వెల్లడించింది.  అయితే తొలిగించిన ఉద్యోగులకు యస్ బ్యా్ంక్  3నెలల జీతాన్ని చెల్లించింది. హోల్‌సేల్‌, రిటైల్‌, బ్రాంచ్‌ బ్యాంకింగ్‌ సెగ్మెంట్‌.. ఇలా పలు విభాగాల్లో ఉద్యోగులను లేఆఫ్‌ కింద తొలగించారు. 

 ఉద్యోగులను బ్యాలెన్స్ చేయాలనుకుంటున్నట్లు ఎస్ బ్యాంక్ చెప్పుకొచ్చింది. దీనికి కారణం డిజిటల్ బ్యాంకింగ్‌పై దృష్టి పెట్టడమే. డిజిటల్ బ్యాంకింగ్‌పై దృష్టి సారించడమే కాకుండా  మాన్యువల్ వర్క్ ను  తగ్గించడం ద్వారా ఖర్చులను తగ్గించాలని బ్యాంక్ లక్ష్యంగా పెట్టుకుంది.  ప్రస్తుతం యెస్‌ బ్యాంక్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌గా ప్రశాంత్ కుమార్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఆయన బాధ్యతలు స్వీకరించిన తర్వాత 2020లో కూడా ఇలాగే లేఆఫ్‌లు చేపట్టారు. 

గత ఆర్థిక సంవత్సరంలో ఎస్ బ్యాంకు నిర్వహణ ఖర్చులు 17 శాతం పెరిగాయి. అదే సమయంలో 2023-2024 ఆర్థిక సంవత్సరాల మధ్య సిబ్బంది ఖర్చులు 12 శాతానికి పైగా పెరిగాయి. 2024 ఆర్థిక సంవత్సరం చివరి నాటికి బ్యాంకు ఉద్యోగుల కోసం రూ .3774 కోట్లు ఖర్చు చేయగా, 2023 ఆర్థిక సంవత్సరంలో రూ .3363 కోట్లు ఖర్చు చేసింది. 2024 ఆర్థిక సంవత్సరం ముగిసేనాటికి బ్యాంకులో 28,000 మంది ఉద్యోగులు ఉండగా ఏడాది వ్యవధిలో 484 మంది ఉద్యోగులను చేర్చుకుంది.