థ్రిల్లింగ్​ కంటెంట్​తో యేవమ్‌‌‌‌

థ్రిల్లింగ్​ కంటెంట్​తో యేవమ్‌‌‌‌

చాందిని చౌద‌‌‌‌రి, వ‌‌‌‌శిష్ట సింహా, భరత్‌‌‌‌రాజ్‌‌‌‌, అషు రెడ్డి లీడ్ రోల్స్‌‌‌‌లో తెరకెక్కుతున్న చిత్రం ‘యేవమ్‌‌‌‌’. ఏది మంచి, ఏది చెడు అనేది ట్యాగ్‌‌‌‌లైన్. ప్రకాష్‌‌‌‌ దంతులూరి డైరెక్ట్ చేస్తున్న ఈ సైకలాజికల్ థ్రిల్లర్‌‌‌‌‌‌‌‌ను నవదీప్‌‌‌‌, పవన్‌‌‌‌ గోపరాజు నిర్మిస్తున్నారు. శుక్రవారం టీజర్‌‌‌‌‌‌‌‌ను విడుదల చేశారు. టీజర్ లాంచ్ చేసిన దర్శకుడు హరీష్ శంకర్ మాట్లాడుతూ ‘‘యేవమ్‌‌‌‌’ చాలా మంచి టైటిల్. టీజర్ ఇంప్రెసివ్‌‌‌‌గా ఉంది.

ప్రమోషన్ కంటెంట్‌‌‌‌ చూస్తుంటే సినిమా కూడా కొత్తగా ఉంటుందని అనిపిస్తోంది’ అంటూ బెస్ట్‌‌‌‌ విషెస్ చెప్పాడు. దర్శకుడు ప్రకాష్ దంతులూరి మాట్లాడుతూ ‘డిఫరెంట్ నెరేషన్‌‌‌‌, కొత్త తరహా కంటెంట్‌‌‌‌తో వస్తున్న మా సినిమాపై పూర్తి విశ్వాసంతో ఉన్నాం. మహిళా సాధికారికతను చాటి చెప్పేలా సినిమా ఉంటుంది. తప్పకుండా అందరికి నచ్చుతుంది’ అన్నాడు.