క్యా మ్యాట్ హై

క్యా మ్యాట్ హై

ఫిట్​నెస్​ మ్యాట్​లో గేమింగ్​ కూడా ఉంటే... భలే ఉంటుంది కదా! అలాంటిదే ఇప్లి(yipli) స్మార్ట్​ ఫిట్​నెస్​ గేమింగ్​ మ్యాట్​. కొవిడ్​‌‌–19 కొత్త వేరియెంట్లు వస్తున్న ఈరోజుల్లో ఎక్కువ మంది ఇంటి నుంచే పనిచేస్తున్నారు. దాంతో ఫిట్​నెస్​ అనేది ప్రయారిటీ లిస్ట్​లో టాప్​ ప్లేస్​లోకి చేరింది. ఇప్లి గేమింగ్​ మ్యాట్​ తెచ్చుకుంటే జిమ్​కు వెళ్లి ఎక్సర్​సైజ్​ చేయలేకపోతున్నాం అనే బాధ ఉండదు. చూడటానికి యోగా మ్యాట్​లా ఉండే దీనిలో మోషన్​ సెన్సర్​ ఉంటుంది. మ్యాట్​ మీద గేమ్స్​ ఆడేటప్పుడు ఇందులో ఉండే సెన్సర్​ 40 రకాల బాడీ మూవ్​మెంట్స్​ను ట్రాక్​ చేస్తుంది. 182.9 సెంటీమీటర్ల పొడవు, 61 సెంటీమిటర్ల వెడల్పు ఉంటుంది. మిడ్​ సైజ్​ లివింగ్​ రూమ్​లో ఎక్కువ ప్లేస్​ ఆక్రమించుకోని ఈ మ్యాట్​ బరువు

ఒకటిన్నర కేజీలే
బ్లాక్​ బాక్స్​లా ఉండే మ్యాట్​ బాక్స్​కు ఎడమ పక్కన ఒక బటన్​ ఉంటుంది. దాన్ని ప్రెస్​ చేస్తే లైట్​ వెలుగుతుంది. మ్యాట్​ చార్జింగ్​ను బట్టి లైట్​ రంగులు మారుతుంటుంది. చార్జింగ్​ 30–100 శాతం ఉంటే గ్రీన్​ కలర్​, 30–10 శాతం ఉంటే ఆరెంజ్​,10శాతం కంటే తక్కువ చార్జింగ్​ ఉంటే రెడ్​ కలర్​ లైట్​ వెలుగుతుంది. ఈ మ్యాట్​లో 1500 ఎమ్​ఎహెచ్​ బ్యాటరీ ఉంటుంది. చార్జింగ్​కు రెండు గంటల కంటే తక్కువ టైం పడుతుంది. ఈ స్మార్ట్​మ్యాట్​ను ఒకసారి చార్జింగ్​ చేస్తే ఆరు నుంచి ఎనిమిది గంటలు వాడుకోవచ్చు.

ఇన్​స్టాల్​ చేసుకోవచ్చు
ఈ మ్యాట్​ మీద ఆడుకోవాలంటే ఇప్లి యాప్​ను స్మార్ట్​ఫోన్​లో ఇన్​స్టాల్​ చేసుకోవాలి. అకౌంట్​ క్రియేట్​ చేసుకుని మ్యాట్​ను యాప్​తో సింక్​ చేయాలి. తరువాత 16గేమ్స్​ సెలక్ట్​ చేసుకోవచ్చు. మ్యాట్​ కోసం ప్రత్యేకంగా తయారుచేసిన ఈ గేమ్స్​ను డౌన్​లోడ్​ చేసుకుని ఫోన్​లో ఇన్​స్టాల్​ చేసుకోవాలి. ఈ ప్రాసెస్​ చాలా సింపుల్​. మ్యాట్​ వాడే వాళ్ల ఇష్టాన్ని బట్టి గేమ్స్​ కోసం ఫోన్​ డిస్​ప్లేను వాడొచ్చు(మ్యాట్​తో పాటు ఇప్లి బండిల్స్​ ఫోన్​ స్టాండ్​ వస్తుంది). లేదంటే ల్యాప్​టాప్​, పర్సనల్​ కంప్యూటర్ స్క్రీన్​కు చార్జింగ్​ కేబుల్​తో కనెక్ట్​​ చేసుకోవచ్చు. ఇవేవీ కాదంటే ఫోన్​ స్ర్కీన్​ను స్మార్ట్​ టీవీలో టెలికాస్ట్​ చేసుకోవచ్చు.
ఇందులో ఉండే ప్రతీ గేమ్​ డిఫరెంట్​ థీమ్​తో ఉంటుంది. ఉదాహరణకు జాయ్​ఫుల్​ జంప్స్, మ్యాట్​ బీట్స్​, స్కేటర్​ గేమ్స్​ తీసుకుంటే... మొదటి గేమ్​  రన్నింగ్, జంపింగ్​ చేయిస్తుంది. రెండోది పాటకు అనుగుణంగా మ్యాట్​ మీద స్టెప్స్​ వేయిస్తుంది. మూడో గేమ్​లో స్కిప్పింగ్​ చేయిస్తుంది. అలాగే మ్యాట్​ మీద ఉండే అబ్​స్టకిల్స్​ దాటేందుకు అడుగులు వేయడం, జంప్​ చేయడం వంటివి చేయాల్సి వస్తుంది. ఈ గేమ్స్​లో ఒకదానికి మరొకదానికి మధ్య ఎక్కువ గ్యాప్​ ఉండదు. అందుకని త్వరగా అలసిపోయినట్టు అనిపిస్తుంది. రోజుకు 10నిమిషాలు ఈ మ్యాట్​ వాడితే చాలు చాలాసేపు ఎక్సర్​సైజ్​ చేసిన ఫీల్​ వస్తుంది. 

ఇద్దరికి ఓకే..
ఈ ఫిట్​నెస్​ మ్యాట్​ను పిల్లలు బాగా ఎంజాయ్​ చేస్తారు. ఎందుకంటే గేమ్ ఆడేటప్పుడు బ్రేక్​ ఎక్కువ సేపు ఉండదు. వెంటవెంటనే ఆడాలి. ఈ మ్యాట్​ మీద ఇద్దరు ప్లేయర్లు కూడా ఆడొచ్చు. మల్టీప్లేయర్​ల కోసం మ్యాట్​ మీద బాణం గుర్తులు ఉంటాయి. ఫ్రెండ్స్​, రిలేటివ్స్​ ప్రొఫైల్స్​ను ఇప్లి యాప్​లో యాడ్​ చేసుకోవచ్చు. ఎంత ఫిట్​నెస్​ ఆటలు అయినా స్కోర్​ ఎంతో తెలుసుకోవాలి అనిపిస్తుంది కదా. అందుకు వర్చువల్​ లీడర్​బోర్డ్​ ఉంటుంది. దానిమీద ఫిట్​నెస్​ స్కోర్స్​ చూసుకోవచ్చు. కరోనా కేసులు పెరుగుతున్న టైంలో వర్కవుట్స్​ కోసం బయట జిమ్​కు వెళ్లడం ఇష్టపడని వాళ్లు ఇప్లి గేమింగ్​ మ్యాట్​ తెచ్చుకోవడం బెటర్​. ఇప్లి కంపెనీ ఇ–స్టోర్, అమెజాన్​లో స్మార్ట్​ ఫిట్​నెస్​ మ్యాట్​ అందుబాటులో ఉంది.