ఆసనాలతో ఆరోగ్యం

ఆసనాలతో ఆరోగ్యం

సీజన్​తో పనిలేకుండా వేధించేవి మెడ, వెన్ను నొప్పి, డైజెషన్​ ప్రాబ్లమ్స్. వీటికి చెక్​ పెట్టాలంటే రోజూవారీ ఎక్సర్​సైజ్​లు కాకుండా ఈ యోగాసనాలు ప్రాక్టీస్ చేయాలి.
వజ్రాసనం: దీన్ని డైమండ్ పోజ్​ అని కూడా అంటారు. మోకాళ్ల మీద కూర్చోవాలి. అరచేతుల్ని మోకాళ్ల మీద లేదా తొడల మీద ఆనించాలి. దీనివల్ల మైండ్ ప్రశాంతంగా ఉంటుంది. ఎసిడిటీ, గ్యాస్​ తగ్గిస్తుంది. మోకాళ్ల నొప్పుల నుంచి రిలీఫ్​ వస్తుంది. తొడ కండరాలు బలంగా తయారవుతాయి. వెన్ను నొప్పి తగ్గుతుంది. యూరినరీ ప్రాబ్లమ్స్ తగ్గుతాయి. 

త్రికోణాసనం: ఈ ఆసనాన్ని ట్రయాంగిల్ పోజ్​ అని కూడా అంటారు. నిటారుగా నిల్చొని రెండు కాళ్లను ఎడంగా జరపాలి. నిల్చున్నప్పుడు కాళ్లు ‘వి’ ఆకారంలో ఉండాలి. శ్వాస తీసుకుంటూ బాడీని కుడివైపుకు వంచుతూ, ఎడమ చేతిని నిటారుగా పైకి లేపాలి. అప్పుడు కుడి చేతిని కిందకి చాచి మడమ దగ్గర ఆనించాలి. తల పైకెత్తి ఎడమ చేతి వైపు చూడాలి.   ఈ ఆసనం వేయడం వల్ల వెన్నెముక ఫ్లెక్సిబుల్​గా తయారవుతుంది. 

బ్యాలెన్స్​ చేయడానికి ఇది బాగా పనికొస్తుంది. అంతేకాకుండా రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. దాంతో హార్ట్ ఎటాక్​ ముప్పు తప్పుతుంది. వెన్నెముక ఫ్లెక్సిబుల్​ అవుతుంది. గ్యాస్ట్రిక్ ట్రబుల్, అజీర్తి, ఎసిడిటీ వంటివి తగ్గించి, డైజెషన్​ని మెరుగుపరుస్తుంది. అర చేతులు, మడిమలను బలంగా చేస్తుంది. స్ట్రెస్​, యాంగ్జైటీ నుంచి రిలీఫ్ ఇస్తుంది. ప్రెగ్నెంట్ లేడీస్​కి బాగా ఉపయోగ పడుతుంది. నార్మల్ డెలివరీకి హెల్ప్ అవుతుంది.