ఈ మూడు వస్తువులు మీ ఇంట్లో ఉన్నాయా... ఇక కనక వర్షమే..

ఈ మూడు వస్తువులు మీ ఇంట్లో ఉన్నాయా... ఇక కనక వర్షమే..

చాలా మంది ఎంతో కష్ట పడుతుంటారు. కాని ఎప్పుడూ డబ్బుకు ఇబ్బంది పడుతూనే ఉంటారు... కషణం తీరిక లేదు.. అణా ఆదాయం లేదని సామెత కూడా ఉంది.  నివసించే ఇంటిలో కొన్ని వాస్తు దోషాలు ఉంటే...సంపాదించిన డబ్బు ఆవిరిలాగా ఖర్చువుతుందని పండితులు చెబుతున్నారు.  అందంగా కట్టిన ఇంటిని  రెన్నోవేషన్​ చేయాలంటే మళ్లీ ఖర్చుతో కూడుకున్న పనే.. అసలే డబ్బులు నిలవడం లేదని బాధ పడుతుంటే మళ్లీ ఇదేంట్రా బాబూ అని తలలు పట్టుకుంటారు.  ఇలాంటి వారికి వాస్తు దోష పరిహారం ఇంటిలో కొన్ని వస్తువులు ఉంచుకున్నట్లయితే కొంతవరకు ఖర్చులు తగ్గుతాయని వాస్తు పండితులు అంటున్నారు.. వారి వివరాల ప్రకారం ఇంట్లో ఏఏ వస్తువులు ఉంచుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. . . . 

హిందూ ధర్మంలో వాస్తు శాస్త్రానికి చాలా ప్రాధాన్యత ఉంది. వాస్తు శాస్త్రం ప్రకారం ఇల్లు కట్టకపోతే ఆ ఇంట్లో దారిద్ర్యం, రోగాలు వచ్చే ప్రమాదం ఉందని చాలామంది నమ్ముతారు. వాస్తుశాస్త్రం ప్రకారం ఇంట్లో కొన్ని అపవిత్ర వస్తువులు ఉంచినా వాస్తుదోషం ఏర్పడి ప్రతికూల శక్తి వ్యాపిస్తుందని భావిస్తారు. మరోవైపు, ఇంట్లో పవిత్ర వస్తువులను ఉంచినట్లయితే, సానుకూల శక్తి ప్రసారం చేయబడుతుందని ...   వాస్తు దోషం కూడా తొలగిపోతుందని  వాస్తు పండితులు చెబుతున్నారు. 

 ఇంట్లో కొన్ని వస్తువులను ఉంచడం వల్ల ఆనందం.. శాంతి, శ్రేయస్సు, మంచి ఆరోగ్యం మరియు మానసిక స్థిరత్వం లభిస్తాయని అంటారు.  వాస్తు నిపుణుల  అభిప్రాయం ప్రకారం ఇంట్లో తప్పక ఉండాల్సిన వస్తువుల్లో మొదటిది గంట అని తెలిపారు. తప్పని సరిగా ఇంట్లో నిత్యం గంట మోగించాలని వాస్తు పండితులు చెబుతున్నారు. ఇంట్లో ఈశాన్య మూలలో దేవుని మందిరం ఉన్నచోట ప్రతిరోజు గంట మోగించాలని వివరించారు. గంట మోగించడం వల్ల మన జీవితంలో ప్రతికూలత తొలగిపోయి సానుకూలత పెరుగుతుందని పేర్కొన్నారు. గంట మోగించడం వల్ల క్రిములు ఇంట్లోకి ప్రవేశించకుండా రోగాలు దూరమవుతాయని తెలిపారు.

ఇంట్లో పూజా స్థలంలో శంఖం ఉంచడం ఎంతో అవసరమని వాస్తు నిపుణులు అంటున్నారు. శంఖం ఉన్న ఇళ్లలో వాస్తుదోషం ఉండదు. ఇంట్లో శంఖం ఉండటం వల్ల డబ్బుకు సంబంధించిన సమస్యలు రావు. శాస్త్రాల ప్రకారం, శంఖం విష్ణువు ,లక్ష్మికి చాలా ప్రియమైనది.  అందుకే  నూతనంగా భవనాలు నిర్మించేటప్పుడు శంకుస్థాపన కార్యక్రమంలో ఈశాన్య భాగంలో శంఖం ఉంచుతారు. శంఖం సానుకూల శక్తిని, ఉత్సాహాన్ని మరియు విశ్వాసాన్ని తీసుకువస్తుందని భావిస్తారు. శంఖం నూనెతో శరీరం యొక్క శక్తి కూడా సానుకూలంగా మారుతుంది.

వీటితో పాటు ఇంట్లో ఒక వేణువు ( ఫ్లూట్​) ఉండాలని ఆమె పేర్కొన్నారు. వెదురు వేణువును ఉంచే ఇంట్లో ఎల్లప్పుడూ ఆనందం మరియు శ్రేయస్సు ఉంటుందని నమ్ముతారు. ఇంట్లో వేణువును ఉంచడం వల్ల వ్యాపారం మరియు ఉద్యోగంలో పురోగతి ఉంటుంది. రోజుకి ఒక్కసారైనా ఇంట్లో గంటలు, శంఖాలు, వేణువుల శబ్దం వినిపించడం వల్ల వాస్తు దోషం తొలగిపోయి ఇంట్లో అందరిలో ప్రేమ, సంతోషం పెరుగుతాయని నమ్మకం. అందువల్ల పూజగదిలో గంటలు, శంఖాలు మరియు వేణువులు తప్పనిసరిగా ఉంచాలంటున్నారు