
పారిస్ ఫ్యాషన్ వీక్ కొత్త ఎడిషన్ అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ ఫ్యాషన్ వీక్ లో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఐశ్వర్య రాయ్ బచ్చన్ తన గ్లామర్ తో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ర్యాంప్ పై హోయలు పోయారు. అందరి దృష్టిని ఆకర్షించి ఐశ్వర్య తన ప్రత్యేకతను చాటుకున్నారు. అంతే కాదు ఈ సందర్భంగా జరిగిన ఒక సన్నివేశం వైరల్ అవుతోంది. ఒక వీడియోలో ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తుంది. అమెరికాకు చెందిన భారతీయ సంతతికి చెందిన ఇన్‌ఫ్లుయెన్సర్ ఆదిత్య మదిరాజు పంచుకున్న మాటలకు ఐశ్వర్య ఆశ్చర్యపోయింది.
#AishwaryaRaiBachchan ♥️♥️♥️ #LOrealParis #ParisFashionWeek pic.twitter.com/tU1WDFLfqN
— aish_my_queen (@AishwaryaRai01) September 30, 2025
నా భర్తతో నేను కలిసి ఉండటానికి మీరే కారణం..
"నేను, నా భర్త అమిత్ తొలిసారి డేటింగ్‌కి వెళ్లినప్పుడు, మీ గురించి దాదాపు రెండు గంటలు మాట్లాడుకున్నాం అని ఐశ్వర్యకు ఆదిత్య వివరించారు. నువ్వు ఐశ్వర్యను ఇష్టపడ్డావు కాబట్టే నేను నిన్ను పెళ్లి చేసుకున్నాను అని నా భర్త అన్నాడు అని చెప్పుకొచ్చారు. అంతేకాదు, ఆదిత్య తన రెండున్నర సంవత్సరాల కుమార్తె యానా ఫోటోను కూడా ఐశ్వర్యకు చూపించారు.
ఆదిత్య మాటలకు ఐశ్వర్య రాయ్ మనసు కరిగిపోయింది. కళ్ళలో ఆశ్చర్యం, సంతోషం కలగలిపిన భావంతో ఆమె "బ్లెస్... ఓ మై గాడ్... తన వయసెంత?" అని అడిగింది. అప్పుడు ఆదిత్య, యానా అంటే హీబ్రూ భాషలో 'దేవుడు దయగలవాడు' అని అర్థం అని చెప్పి.. మిమ్మల్ని వ్యక్తిగతంగా చూడటం ఒక కల. మీరు నిజంగానే మరింత అద్భుతంగా ఉన్నారని పొగర్తలతో ముంచెత్తారు. మీరు ఎంత గొప్ప నటి, డ్యాన్సర్, గొప్ప మహిళ అని ఆదిత్య ప్రశంసించారు.
బహుమతిగా లిప్‌స్టిక్
అభిమాని మాటలకు ఎమోషనల్‌గా స్పందించిన ఐశ్వర్య, "మీ ప్రేమకు ధన్యవాదాలు. మీరు ఇంతకుముందు నాతో చెప్పిన విషయం చాలా బాగుంది. మీ బిడ్డను దీవించండి, మీకు, మీ భర్తకు చాలా ప్రేమ" అని బదులిచ్చింది. తనపై అంతటి ప్రేమను చూపించిన అభిమానికి గుర్తుగా, ఐశ్వర్య తన చేతిలోని ఒక లిప్‌స్టిక్‌ను బహుమతిగా ఇచ్చి.. మీరు మేకప్‌తో మ్యాజిక్ చేస్తారు. కాబట్టి, దీన్ని మీ నిధికి జోడించండి అని చిరునవ్వుతో చెప్పింది.
ఈ సెలబ్రిటీ-అభిమాని సంభాషణ చూసి నెటిజన్లు ఫిదా అయ్యారు. ఇది ఒక ఐకానిక్ మూమెంట్, ఎపిక్, ఎమోషనల్ అని కామెంట్లు పెడుతూ, ఇదొక అరుదైన దృశ్యం అని అభివర్ణించారు. ఐశ్వర్య , ఆదిత్య మాదిరాజు వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.