V6 News

వెళ్లడానికి అనుమతిచ్చి.. కాల్పులా..? ఇండియన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నేవీ ఆఫీసర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇరాన్ నేవీకి పంపిన ఆడియో మెసేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వైరల్

వెళ్లడానికి అనుమతిచ్చి.. కాల్పులా..? ఇండియన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నేవీ ఆఫీసర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇరాన్ నేవీకి పంపిన ఆడియో మెసేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వైరల్

న్యూఢిల్లీ: హార్మూజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జలసంధి నుంచి వెళ్లేందుకు పర్మిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇచ్చిన ఇరాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌.. తీరా నౌకలు బయల్దేరాక కాల్పులు జరపడంపై ఉద్రిక్తత నెలకొంది. శనివారం భారత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చెందిన రెండు షిప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లపై ఇరాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కాల్పులు జరుపుతున్నప్పుడు.. మన నేవీ సిబ్బంది ఇరాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నేవీకి పంపిన రేడియో సందేశం ఆదివారం బయటపడటంతో వైరల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అయింది. ‘‘సెపా నేవీ.. సెపా నేవీ.. ఇది మోటార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ట్యాంకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హెరాల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌. మీరు నాకు వెళ్లేందుకు క్లియరెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇచ్చారు. మీ లిస్టులో నా పేరు రెండోది. 

ముందు అనుమతి ఇచ్చి.. ఇప్పుడు కాల్పులు జరుపుతున్నారా?.. వెనక్కి వెళ్లేందుకు అవకాశం ఇవ్వండి” అని ఇండియన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నేవీ కెప్టెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రేడియో మెస్సేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో చెప్పారు. హార్మూజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జలసంధిలోని ఖేష్మ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌.. లారక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఐలాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల మధ్య ప్రాంతంలో మన నౌకను అడ్డుకుంటున్న సెపా నేవీ స్పెషల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫోర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కమాండోలకు ఆయన ఈ ఆడియో సందేశాన్ని పంపించారు. 

అనంతరం వారు కాల్పులు ఆపడంతో మన దేశ నౌకలు వెనక్కి తిరిగాయి. ఈ ఘటనపై భారత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఇరాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎంబసీ అధికారులతో మాట్లాడి, భారత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు వస్తున్న నౌకలకు సురక్షిత మార్గం కల్పించాలని కోరింది. కాల్పులకు గురైన షిప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లలోని నేవీ సిబ్బంది అందరూ సేఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఉన్నారని కన్ఫామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసింది.

ఆందోళన అవసరం లేదు: ఇరాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

ఇండియన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ షిప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లపై కాల్పుల గురించి పూర్తి సమాచారం లేదని ఇరాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రతినిధి అబ్దుల్ మజీద్ హకీమ్ ఇలాహీ చెప్పారు. ఈ ఘటనపై ఎటువంటి ఆందోళన అక్కర్లేదని చెప్పారు. భారత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో ఇరాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు బలమైన దౌత్య సంబంధాలు ఉన్నాయని, సమస్య శాంతియుతంగా పరిష్కారమవుతుందని అన్నారు.