యువ బైక్ రేసర్ శ్రేయాస్ దుర్మరణం

యువ బైక్ రేసర్ శ్రేయాస్ దుర్మరణం
  • మద్రాస్ మోటార్ రేసింగ్ ట్రాక్‌‌లో 
  • బైక్​​ స్కిడ్​ కావడంతో ప్రమాదం

చెన్నై: యువ బైక్​ రేసర్ ​కొప్పరం శ్రేయాస్ హరీశ్ మృతి చెందాడు. శనివారం చెన్నైలోని ఇరుంగట్టుకోట్టైలో జరిగిన నేషనల్ మోటార్‌‌ సైకిల్ రేసింగ్ ఛాంపియన్‌‌షిప్ (ఎన్​ఎంఆర్​సీ)లో మద్రాస్ మోటార్ రేసింగ్ ట్రాక్‌‌లో ప్రమాదానికి గురయ్యాడు. రేస్​లో 200సీసీ బైక్‌‌ నడుపుతుండగా మూడో రౌండ్ లో బైక్​స్కిడ్ అయి కిందపడిపోయాడు. అదే సమయంలో హెల్మెట్ కూడా ఊడిపోవడంతో అతడి తలకు బలమైన గాయమైంది. వెంటనే శ్రేయాస్‌‌ ను ఆస్పత్రికి తరలించినా ఉపయోగం లేకుండా పోయిందని, అప్పటికే చనిపోయాడని డాక్టర్లు ప్రకటించారు. 

ఈ ఏడాది మేలో స్పెయిన్‌‌లో జరిగిన బైక్​ రేసింగ్‌‌లో వరల్డ్​ ఛాంపియన్‌‌షిప్ ఫైనల్‌‌కు చేరిన తొలి ఇండియన్ గా​13 ఏండ్ల శ్రేయాస్ చరిత్ర సృష్టించాడు. 'ది బెంగళూరు కిడ్' గా పాపులర్​అయిన శ్రేయాస్.. జులై 26న శ్రేయాస్​తన 13వ పుట్టినరోజును జరుపుకున్నాడు. శ్రేయాస్ మృతితో వీకెండ్​లో జరగాల్సిన రేసులను మద్రాస్ మోటార్ స్పోర్ట్స్ క్లబ్ రద్దు చేసింది. శ్రేయాస్ ఇండియాలో జరిగిన ఎఫ్​ఐఎం మినీ జీపీలో పాల్గొని తన కేరీర్​ను ప్రారంభించాడు. 2022లో చాంపియన్‌‌ షిప్‌‌ను గెలుచుకున్నాడు. ఆ తర్వాత, అతను నేషనల్ చాంపియన్‌‌ షిప్‌‌లో పాల్గొన్నాడు.