
తల్లి మందలించిందని కొడుకు మనస్థాపానికి గురై చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన మండల పరిధిలో సోమవారం చోటుచేసుకుంది. మరికల్ఎస్సై జానకీరాంరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని కన్మనూర్కు చెందిన రామచంద్రమ్మ పెద్ద కొడ్డకు వడ్డె కురుమూర్తి(22) రెండుమూడేండ్ల నుంచి పనిచేయకుండా ఊర్లోనే తిరుగుతున్నాడు. కుటుంబ పోషణ భారం తల్లిమీదే పడటంతో ఏదైనా పనిచేయాలని కురుమూర్తిపై కోపగించింది. దీంతో మనస్థాపానికి గురై ఊరి శివారులోని వ్యవసాయం పొలంలో చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. రైతులు గమనించి తల్లికి తెలియజేశారు. తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నారాయణపేట ఆస్పత్రికి తరలించారు.