పెళ్లై నాలుగు నెలలు కూడా కాలే.. భార్యాభర్తలు గడ్డి మందు తాగిండ్రు.. జనగామ జిల్లాలో ఘటన

పెళ్లై నాలుగు నెలలు కూడా కాలే.. భార్యాభర్తలు గడ్డి మందు తాగిండ్రు.. జనగామ జిల్లాలో ఘటన

కొత్తగా పెళ్లైన జంట.. వివాహం పూర్తై ఇంకా నాలుగు నెలలు కూడా దాటలేదు. కానీ అప్పుడే జీవితాన్ని చాలించాలనుకున్నారు ఆ యువ దంపతులు. గడ్డిమందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించిన ఘటన జనగామ జిల్లాలో విషాదాన్ని నింపింది. 

వివరాల్లోకి వెళ్తే.. స్టేషన్ ఘనపూర్ మండలం తాటికొండలో జరిగింది ఈ ఘటన. గడ్డి మందు తాగి భార్యాభర్తల ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా చికిత్స పొందుతూ భర్త మారపాక అన్వేష్ (26) మృతి చెందాడు. భార్య గడ్డం పావని (22) ఎంజీఎంలో చికిత్స పొందుతోంది. 

అన్వేష్, పావని నాలుగు నెలల క్రితం వివాహం చేసుకున్నారు. నాలుగు నెలలుగా పని చేయకుండా ఇంట్లోనే ఉంటుండడంతో తల్లిదండ్రులు మందలించినట్లు గ్రామస్తులు తెలిపారు. దీంతో కూలి పని చేయడం ఇష్టం లేక ఆత్మహత్యాయత్నం చేసినట్లు తెలిపారు. ఏదైనా పనిచేసుకుని బతకాలని చెప్పామని.. ఇంత దారుణానికి పాల్పడతారని అనుకోలేదని తల్లిదండ్రులు తీవ్రంగా ఏడుస్తున్నారు.