బంజారాహిల్స్ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేసిన బాధితురాలు

బంజారాహిల్స్ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేసిన బాధితురాలు

భర్త కళ్ల ఎదుటే భార్యను అత్యాచారం చేసేందుకు  పోలీసులు ప్రయత్నించారంటూ బాధితురాలు ఆరోపిస్తుంది.

డిసెంబర్ 3న యూసఫ్ గూడా కు చెందిన సురేష్ అట్లూరీ, అతని భార్య పిటిషన్ ఇచ్చేందుకు బంజారాహిల్స్ పోలీసుల్ని ఆశ్రయించారు.

పిటిషన్ ఇచ్చిన తనను ఓ ఎస్సై దూషించారని బాధితురాలు తెలిపింది. ప్రాస్టిట్యూట్ రాసిచ్చినట్టు రాసింది అంటూ తిట్టారని చెప్పింది.  బంజారాహిల్స్ పీఎస్ లో సీఐ కళింగరావు, ఎస్సై రాంబాబు, డీఐ రవికుమార్, ఎస్సై వీడినాయుడు, ఎస్సై రామిరెడ్డి లు తనపై అత్యాచార యత్నానికి ప్రయత్నించారని వీడియోలో తెలిపింది. పోలీసుల నుంచి తమకు ప్రాణహాని ఉందని, తమకు రక్షణ కల్పించాలని కోరుతూ  ఓ వీడియోను విడుదల చేసింది.

బంజారాహిల్స్ పోలీసులపై సీపీ అంజనీ కుమార్ కు ఫోన్ లో ఫిర్యాదు చేసినట్లు బాధితురాలు చెప్పింది. పోలీసులు పై చర్యలు తీసుకుంటామని, తన ఆఫీస్ కు రావాలని సీపీ అన్నట్లు తెలిపారు. ఆ విషయం తెలిసిన  ఏసీపీ తనకు ఫోన్ చేసి కేసు విషయంపై సీపీ వద్దకు వెళ్లొద్దని, ఏమైనా ఉంటే తామే సెటిల్ చేస్తామని, బంజారాహిల్స్ పీఎస్ కి వెళితే కంప్లెయింట్ ఇస్తే తీసుకుంటారని చెప్పడంతో సీపీకి వద్దకు వెళ్లకుండా వెనక్కి వచ్చినట్లు తెలిపారు.

అదే కేసు విషయంపై డిసెంబర్ 8న బంజారాహిల్స్ పీఎస్ వెళ్లిన తనపై అత్యాచారయత్నానికి ప్రయత్నించిన బాధితురాలు వీడియోలో చెప్పింది.