
మెదక్‌టౌన్, వెలుగు : గుండెపోటుతో ఓ యువ క్రికెటర్ చనిపోయాడు. ఈ ఘటన మెదక్ జిల్లా కేంద్రంలో బుధవారం జరిగింది. వివరాల్లోకి వెళ్తే... పట్టణంలోని నవాపేట వీధికి చెందిన జలాల్‌పూర్ సాయి కిశోర్ (28) బుధవారం ఇంట్లో ఉన్న టైంలో హార్ట్‌స్ట్రోక్‌తో ఒక్కసారిగా కుప్పకూలాడు.
కుటుంబ సభ్యులు గమనించేలోగా అక్కడికక్కడే చనిపోయాడు. సాయికిశోర్ జిల్లా, రాష్ట్ర స్థాయి క్రికెట్ టోర్నీలో ఆల్‌రౌండర్‌గా ప్రతిభ చూపాడు. మృతుడికి భార్య భాగ్య, ఇద్దరు కుమార్తెలు ఆరాధ్య, హిమాద్విత ఉన్నారు.