ద‌గ్గుబాటి ఇంట పెళ్లి సంద‌డి

ద‌గ్గుబాటి ఇంట పెళ్లి సంద‌డి

దగ్గుబాటి(Daggubati) వారింట పెళ్లి సందడి మొదలు కానుంది. ప్రముఖ నిర్మాత దగ్గుబాటి సురేష్(Daggubati Suresh) రెండో కొడుకు దగ్గుబాటి అభిరామ్(Daggubati Abhiram) కు పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నారట పెద్దలు. కారంచేడుకు చెందిన తన చినతాత కూతురు కూతురునే పెళ్లాడనున్నాడట అభిరామ్. ఈ విషయంపై ఇప్పటికే ఇరు కుటుంబాల మధ్య చర్చలు కూడా జరిగాయట.

ఇక త్వరలోనే నిశ్చితార్థం జరిపించి.. ఆ వెంటనే పెళ్లి కూడా జరిపించాలని చూస్తున్నారట పెద్దలు. దీంతో అభిరామ్ కు దగ్గుబాటి అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ విషయంపై త్వరలోనే  అధికారిక ప్రకటన రానుంది 

ఇక అభిరామ్ విషయానికి వస్తే.. రీసెంట్ గా ఆయన హీరోగా వచ్చిన అహింస సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ అభిరాంకు మొదటి సినిమా కావడం విశేషం. దర్శకుడు తేజ తెరకెక్కించిన ఈ సినిమా ఆడియన్స్ ను అంతగా ఆకట్టుకోలేకపోయింది. దీంతో మొదటి సినిమాతోనే పరాజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు అభిరామ్. ప్రస్తుతం తన రెండో సినిమాను సెట్ చేసుకునే పనిలో ఉన్నాడు ఈ యంగ్ హీరో.