పవన్ కళ్యాణ్తో కిరణ్ అబ్బవరం మూవీ.. క్రేజీ న్యూస్ చెప్పిన యంగ్ హీరో

పవన్ కళ్యాణ్తో కిరణ్ అబ్బవరం మూవీ.. క్రేజీ న్యూస్ చెప్పిన యంగ్ హీరో

యంగ్ హీరో కిరణ్ అబ్బవరం(Kiran Abbavaram) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చి వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా గడుపుతున్నాడు. ఇక ఆయన సినిమాలు చేసిన సంస్థలన్నీ టాప్ లిస్టులో ఉన్నవే. గీతా ఆర్ట్స్, మైత్రి మూవీ మేకర్స్, మెగా సూర్య మూవీస్ వంటి పెద్ద పెద్ద నిర్మాణ సంస్థల్లో సినిమాలు చేశారు కిరణ్ అబ్బవరం. ఇక ఇటీవలే రూల్స్ రంజాన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు కిరణ్. అయితే ఈ సినిమా అనుకున్న స్థాయిలో సక్సెస్ అవలేదు. 

ఇదిలా ఉంటే.. ఇటీవల కిరణ్ అబ్బవరం దావత్ అనే టాక్ షో లో పాల్గొన్నారు. ఇందులో భాగంగా తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ విషయాల గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఫ్యూచర్ లో డైరెక్షన్ చేయాల్సి వస్తే ఏ హీరోను సెలెక్ట్ చేసుకుంటారు అని అడగగా.. నాకు రైటింగ్ అంటే చాలా ఇష్టం.. నా మొదటి సినిమా పవన్ కళ్యాణ్ గారితో చేస్తా అని తన మనసులోని మాటను బయట పెట్టేశాడు కిరణ్.

ఇక కిరణ్ అబ్బవరం చాలా షోలలో తన అభిమాన హీరో ఎవరంటే కూడా పవన్ కళ్యాణ్ అని చెప్పిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అందుకే తన డైరెక్షన్ సినిమా చేస్తే ముందు తన అభిమాన నటుడు పవన్ కళ్యాణ్ తో చేస్తా అని టక్కున చెప్పేశాడు కిరణ్. దీంతో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కిరణ్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు.