
టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్‌లో ఒకరైన శర్వానంద్ ఇటీవల పెళ్లి కబురు చెప్పిన విషయం తెలిసిందే. రక్షిత రెడ్డితో పెళ్లిపీటలెక్కనున్న శర్వా.. ఇటీవలే నిశ్చితార్థం కూడా చేసుకున్నాడు. అయితే, ఈ వేడుక జరిగి 5 నెలలు గడుస్తున్నా పెళ్లి డేట్ ఫిక్స్ చేయకపోవడంతో వీరి వివాహం క్యాన్సిల్ అయ్యిందంటూ పలు వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి.
అయితే తాజాగా ఈ వార్తలపై హీరో టీం క్లారిటీ ఇచ్చింది. పెళ్లి క్యాన్సిల్ అంటూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతం సినిమాలతో శర్వా బిజీగా ఉన్నాడని వారు తెలిపారు. ప్రస్తుతం వారిద్దరూ హ్యాపీగానే ఉన్నారని, సినిమా షూటింగ్ పూర్తి కాగానే పెళ్లి చేసుకుంటారని చెప్పుకొచ్చారు.
ఇక జూన్ 3వ తేదీన రాజస్థాన్ లో వీరి వెడ్డింగ్‌కు ఏర్పాట్లు జరుగుతున్నట్టు వెల్లడించారు. దీంతో శర్వానంద్ పెళ్లిపై వస్తున్న రూమర్స్ కు చెక్ పడింది.