నార్వే చెస్ టోర్నమెంట్‌లో యువ ఇండియన్ గ్రాండ్‌మాస్టర్ ఆర్ ప్రజ్ఞానంద టైటిల్‌ను సాధించాడు. గ్రూప్ ఏ ఓపెన్ చెస్ టోర్నమెంట్ టోర్నీలో 9 రౌండ్లలో 7.5పాయింట్లు సాధించి విజేతగా నిలిచాడు. టాప్ సీడ్ గా పోటీలో నిలిచిన 16ఏళ్ల ప్రజ్ఞానంద.. 9 రౌండ్లలోనూ అద్బుతమైన ప్రదర్శనను కనబరిచాడు. ఇంటర్నేషనల్ మాస్టర్ వీ ప్రణీత్‌పై టోర్నీలో గెలిచి ప్రజ్ఞానంద ముందంజలో నిలిచాడు.మార్సెల్ ఎరోమిస్కీ, జుంగ్ మిన్ సియోలు వరుసగా 2,3 స్థానాలను దక్కించుకున్నారు.ఇటీవల జరిగిన చెస్సేబుల్ టోర్నీలో నవంబర్ వన్ కార్ల్‌సన్‌ను ఓడించిన ప్రజ్ఞానంద.. గ్రూప్ ఏ టోర్నీలోనూ తన సత్తాను చూపించాడు. ఇదిలా ఉండగా వచ్చే నెలలో చెన్నైలో జరగనున్న 44వ చెస్ ఒలింపియాడ్‌లో ఇండియన్ బీ జట్టులో ప్రజ్ఞానంద ఆడనున్నాడు.

