చొప్పదండి, వెలుగు: డ్రంకెన్ డ్రైవ్‌లో శిక్ష పడుతుందన్న భయంతో ఓ యువకుడు సూసైడ్ చేసుకున్నాడు. ఎస్సై నరేశ్‌రెడ్డి వివరాల ప్రకారం.. చొప్పదండి పట్టణంలోని బీసీ కాలనీకి చెందిన సూర విజయ్(28) ఈ నెల 1న డ్రంకెన్ డ్రైవ్‌లో పట్టుబడ్డాడు. ఆయనపై కేసు నమోదు కాగా శనివారం ఉదయం కోర్టుకు హాజరయ్యాడు. మధ్యాహ్నం ఇంటికి వచ్చాక డ్రంకెన్ డ్రైవ్ కేసులో ఫైన్ కట్టాలని తల్లితో పాటు భార్యకు చెప్పాడు. వారు డబ్బులు లేవని చెప్పడంతో జైలు శిక్ష పడుతుందని భయపడ్డాడు. బెడ్రూంలోకి వెళ్లి చీరతో ఫ్యాన్ కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడికి ముగ్గురు పిల్లలున్నారు.
