కామారెడ్డి: జిల్లాలోని దేవునిపల్లిలో విషాదం చోటు చేసుకుంది. తల్లిదండ్రులు మందలించారని నీలం రాహుల్ (18) అనే యువకుడు ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్న రాహుల్.. బుధవారం రాత్రి తన స్నేహితుని అన్న పెళ్లి ఊరేగింపుకు వెళ్లాడు. రాత్రి వేళ ఇంటికి రాకపోవడంతో.. ఆలస్యమైందని ఫోన్లో తల్లిదండ్రులు మందలించారు. దీంతో మనస్థాపం చెందిన రాహుల్ ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. విషయం తెలిసిన పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
