హైదరాబాద్ దుండిగల్‌లో రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంగా వెళ్తున్న రాయల్ ఎన్ ఫీల్డ్ బైక్ స్కిడ్ అయి పడిపోవడంతో ఒకరు చనిపోయారు. మరో యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. సంగారెడ్డికి చెందిన అభినవ్ (24), వంశీ (25)లు శనివారం రాత్రి 1.30 గంటల సమయంలో దుండిగల్ వెళ్తున్నారు. గండి మైసమ్మ నుండి ప్రగతి నగర్ వెళ్లే దారిలో బైక్ అదుపుతప్పి కిందపడింది. ఈ ఘటనలో అభినవ్ అక్కడికక్కడే మృతిచెందగా.. వంశీకి తీవ్రగాయాలయ్యాయి. వంశీని చికిత్స నిమిత్తం వాహనదారులు స్థానిక హాస్పిటల్‌కు తరలించారు.
