
కంటోన్మెంట్,వెలుగు: యాక్టివా పై వెళ్తుండగా జరిగిన యాక్సిడెంట్లో ఇద్దరు యువకులు చనిపోయిన ఘటన సికింద్రాబాద్పరిధిలో జరిగింది. బోయినపల్లికి చెందిన శరత్(21), రాహుల్(19)లు ఫ్రెండ్స్. వీరు శనివారం రాత్రి 11గంటల సమయంలో హోండా యాక్టివాపై తాడ్ బండ్ నుంచి బోయినపల్లికి వెళ్తుండగా గ్రేవ్‌యార్డు టర్నింగ్వద్ద స్కిడ్అవగా ఎగిరి అవతలి వైపు రోడ్డుపై పడ్డారు. అదే సమయంలో బోయిన్ పల్లి నుంచి తాడ్‌బండ్ వెళ్తున్న ఇన్నోవా కారు వీరిని ఢీ కొట్టింది. దీంతో తీవ్రంగా గాయపడడంతో సికింద్రాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన డాక్టర్లు వారు అప్పటికే మృతి చెందినట్లు చెప్పారు. దీంతో బోయిన్పల్లి పోలీసులు పోస్టుమార్టం కోసం డెడ్‌బాడీలను గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఆదివారం ఇన్నోవా డ్రైవర్‌ను అరెస్ట్ చేసి కేసు ఫైల్చేశామని బోయిన్పల్లి ఇన్స్పెక్టర్ రవికుమార్ తెలిపారు.