
దేశ రాజధాని ఢిల్లీలో పొల్యూషన్ కారణంగా గతంలో వాహనాలకు సరి-బేసి సంఖ్య రూల్ గుర్తుండే ఉంటుంది. దీనికి తోడు తాజాగా 10 పదేళ్లు పైబడిన కార్లకు పెట్రోల్ బంకుల్లో ఇంధనం నిషేధం అనే రూల్ తీసుకొచ్చారు. ఈ ఆంక్షలకు సంబంధించిన సమస్యలను పరిష్కరించడానికి చేస్తున్న ప్రయత్నాలలో ఢిల్లీ ప్రభుత్వ నిర్ణయం చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దింతో ఈ నియమం కారణంగా ఒక వ్యక్తి రెండు లగ్జరీ & కాస్ట్లీ కార్లను అతితక్కువ ధరలకు అమ్ముకోవాల్సి వచ్చింది.
2014లో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఢిల్లీ ఇంకా జాతీయ రాజధాని ప్రాంతంలో 10 సంవత్సరాల కంటే ఎక్కువ కాలంగల డీజిల్ వాహనాలు అలాగే 15 సంవత్సరాల కంటే ఎక్కువ కాలంగల పెట్రోల్ వాహనాలను ఉపయోగించడానికి అనుమతి లేదని తీర్పు ఇచ్చింది. ఈ తీర్పును తరువాత సుప్రీంకోర్టు సమర్థించింది.
ఈ నిబంధన కారణంగా నితిన్ గోయల్ అనే వ్యక్తి తన రూ.65 లక్షల జాగ్వార్ ల్యాండ్ రోవర్ కారును హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన వ్యక్తికి కేవలం రూ.8 లక్షలకు అమ్మేశాడు. అంతేకాకుండా రూ.40 లక్షల మెర్సిడెస్ సి క్లాస్ 220 సిడిఐ స్పోర్ట్స్ లిమిటెడ్ ఎడిషన్ కారును కూడా రూ.4 లక్షలకు అమ్మేశాడు.
2020 వరకు BS-IV వాహనాలను అమ్మడానికి అనుమతిస్తే, అదే నిబంధనలను అనుసరించి 2013లో తయారు చేసిన వాహనాలు అకస్మాత్తుగా వాడటానికి ఎలా పనికిరావు ప్రశ్నించాడు. ఇలా సోషల్ మీడియాలో చాల మంది నెటిజన్ల నుండి విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ప్రజల నుండి తీవ్ర ఆగ్రహం వ్యక్తం కావడంతో ఢిల్లీ పర్యావరణ మంత్రి మంజిందర్ సింగ్ సిర్సా ఇంధన నిషేధం సాధ్యం కాదని, ఇందుకు సాంకేతిక సవాళ్లు వస్తున్నాయని అన్నారు.
ఢిల్లీలో కాలం చెల్లిన వాహనాలపై ఆంక్షలకు సంబంధించిన సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తుందని కూడా తెలిపారు. జూలై 1 నుండి కాలం చెల్లిన వాహనాలకి ఇంధన నిషేధం అమల్లోకి వచ్చిన తర్వాత భారీగా కార్లు, బైకులను స్వాధీనం చేసుకున్నారు. పట్టుకున్న వాహనాలను తిరిగి పొందడానికి కొన్ని షరతులు కూడా పెట్టారు. ఏంటంటే వాహనాన్ని ఢిల్లీ నుంచి వేరే రాష్ట్రానికి తీసుకెళ్తామని అఫిడవిట్ ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే 10వేల చలాన్ కట్టాలి. ఇంకా
వాహనాన్ని స్వాధీనం చేసుకోవడంలో రవాణా శాఖ చేసిన ఖర్చులను కూడా ఓనర్ తిరిగి కట్టాల్సి ఉంటుంది.