Ramayana: సాయి పల్లవి vs కాజల్ Xలో ట్రెండ్.. సీత పాత్రపై నెటిజన్ల కామెంట్స్..

Ramayana: సాయి పల్లవి vs కాజల్ Xలో ట్రెండ్.. సీత పాత్రపై నెటిజన్ల కామెంట్స్..

సహజనటి సాయి పల్లవి (Sai Pallavi) పేరు ప్రస్తుతం సొషల్ మీడియాలో వైరల్ అవుతుంది. నితేష్ తివారీ తెరకెక్కిస్తున్న రామాయణంలో సీతగా సాయి పల్లవి నటిస్తుంది. అయితే, సీత పాత్రలో సాయి పల్లవి సెట్ అవ్వలేదంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. అయితే, చాలా మంది సీత పాత్రలో సాయి పల్లవి పర్ఫెక్ట్ సెట్ అయిందంటూ అంటుండగా.. మరికొందరు ఆ పాత్రకు అవసరమైన దైవిక ప్రకాశం ఆమెకు లేదని వాదిస్తున్నారు.

ఇంకొందరైతే ఆది పురుష్లో నటించిన కృతి సనన్ లేదా దీపికా పదుకొనే బాగా సరిపోతారని సూచిస్తున్నారు. అంతేకాకుండా, హీరోయిన్ కాజల్ అగర్వాల్ అయితే ఇంకా పర్ఫెక్ట్గా సెట్ అవుతుందని అంటున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ విషయంపై పెద్ద చర్చ జరుగుతోంది. సాయి పల్లవి vs కాజల్ పేర్లు Xలో ట్రెండ్ అవుతోన్నాయి. మరి ఈ రచ్చ ఎంతవరకు వెళ్లి ఆగుతుందో తెలియాల్సి ఉంది. 

జూలై 3న రామాయణం ఫస్ట్ గ్లింప్స్ రిలీజై అంచనాలు పెంచింది. ఈ మూవీలో రాముడిగా రణబీర్ కపూర్, సీతగా సాయి పల్లవి, రావణుడిగా యశ్, లక్మణుడిగా రవి దుబే, హనుమంతుడిగా సన్నీ డియోల్‌‌‌‌‌‌‌‌, మండోదరి పాత్రలో కాజల్ అగర్వాల్ నటిస్తున్నారు. ఇది ఒక అమరమైన ఇతిహాస గాథ.. రామ వర్సెస్  రావణ.  అధికారం, ప్రతీకారానికి ప్రతిరూపంగా రావణుడిని... ధర్మం, త్యాగానికి నిర్వచనంగా రాముడి పాత్రను పరిచయం చేసిన తీరు సినిమాపై క్యూరియాసిటీని క్రియేట్ చేసింది.

ఏఆర్ రెహమాన్, హన్స్ జిమ్మర్ అందించిన మ్యూజిక్ అంచనాలు పెంచుతోంది. రెండు భాగాలుగా రూపొందుతోన్న ఈ మూవీ ఫస్ట్ పార్ట్ వచ్చే ఏడాది దీపావళికి, సెకండ్ పార్ట్‌‌‌‌‌‌‌‌ను 2027 దీపావళికి విడుదల చేయనున్నట్టు ప్రకటించారు.