కూకట్పల్లిలో ఫ్లెక్సీ కడుతుండగా కరెంట్ షాక్ .. యువకుడు మృతి

కూకట్పల్లిలో ఫ్లెక్సీ కడుతుండగా కరెంట్ షాక్ .. యువకుడు మృతి

కూకట్​పల్లి, వెలుగు: కూకట్ పల్లి పోలీస్​స్టేషన్ పరిధిలో ఓ యువకుడు కరెంట్ షాక్ తో మృతిచెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భాగ్యనగర్​కాలనీకి చెందని జ్ఞానేశ్వర్​(37) స్థానిక అడ్డా వద్ద ఆటో పెట్టుకొని, షటిల్​ సర్వీసులు నడుపుతుంటాడు. స్థానిక సాయిబాబా ఆలయ నిర్వాహకులు గురుపౌర్ణమిని పురస్కరించుకొని మంగళవారం మధ్యాహ్నం ఏర్పాట్లు చేస్తున్నారు.

 వారికి సహకరించేందుకు జ్ఞానేశ్వర్ ఆలయ కమాన్ ఎక్కి ఫ్లెక్సీ కడుతున్నాడు. ఆ సమయంలో ప్రమాదవశాత్తు కరెంట్​వైర్లకు తగలడంతో షాక్​కొట్టి, అక్కడికక్కడే మృతిచెందాడు. తర్వాత మంటలు పక్కనే ఉన్న బార్ అండ్ రెస్టారెంట్​కు వ్యాపించాయి. ఫైర్​ సిబ్బంది సకాలంలో సంఘటన స్థలానికి చేరుకొని, మంటలను ఆర్పివేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.