తల్లిని, చెల్లిని రోకలిబండతో కొట్టి చంపిన యువకుడు

తల్లిని, చెల్లిని రోకలిబండతో కొట్టి చంపిన యువకుడు

సూర్యాపేట జిల్లాలో దారుణం జరిగింది. ఆస్తి తగాదాలతో మారుతల్లి, చెల్లిని చంపాడో యువకుడు. సూర్యాపేట జిల్లా తాళ్ల ఖమ్మం పహడ్‌లో ఈ సంఘటన జరిగింది. ఆస్తి విషయంలో వచ్చిన గొడవ కారణంగా హరీష్ అనే యువకుడు తన మారుతల్లి అంజమ్మ, చెల్లి మౌనికను గురువారం ఉదయం తెల్లవారుజామున రోకలిబండతో కొట్టి చంపాడు. ఆ తర్వాత హరీష్ పోలీస్‌స్టేషన్‌కి వెళ్లి లొంగిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.