
హుస్నాబాద్, వెలుగు : ప్రమాదవశాత్తు బావిలో పడి ఓ యువకుడు చనిపోయాడు. ఈ ఘటన సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం మాలపల్లెలో మంగళవారం జరిగింది. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన శనిగరం భిక్షపతి, భారతి పెద్ద కొడుకు అజయ్(24) ఇంటర్ వరకు చదివి వ్యవసాయం చేస్తున్నాడు. రోజూలాగే మంగళవారం ఉదయం పొలం వద్ద ఉన్న గేదెలకు మేత పెట్టి వస్తానని తల్లిదండ్రులతో చెప్పి వెళ్లాడు.
ALSO READ : నల్లగొండ ఓల్డ్సిటీ గణేషుడి లడ్డూ @ 36 లక్షలు
ఎంతకూ తిరిగిరాకపోవడంతో తల్లిదండ్రులు బావి వద్దకు వెళ్లి వెతికారు. ఇంటికి వచ్చేదారిలోని బావి వద్ద మట్టిపెల్లలు కూలి ఉన్నట్టు గమనించారు. అనుమానంతో బావిలోకి చూడగా అజయ్ చెప్పులు తేలుతూ కనిపించాయి. ప్రమాదవశాత్తు బావిలో పడిపోయినట్టుగా భావించి గాలించగా అతడి డెడ్‌బాడీ దొరికింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.