
కుమ్రం భీం ఆసిఫాబాద్: జిల్లాలోని దహెగాం మండలం దిగేడ అటవీ ప్రాంతంలో పెద్ద పులి కలకలం రేగింది. పెద్దపులి దాడిలో గ్రామానికి చెందిన విఘ్నేశ్ అనే యువకుడు మృతి చెందాడు. పశువుల మేతకోసమని వెళ్లిన ఆ యువకుడిని పెద్దపులి డాడి చేసి అటవీ ప్రాంతంలోకి లాక్కెళ్లింది. ఈ ఘటనతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. స్థానికుల హడావుడితో పెద్దపులి.. విఘ్నేశ్ మృతదేహాన్ని అక్కడే వదిలివెళ్లింది. యువకుడి మృతితో అతని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా రోదిస్తున్నారు. ఏ క్షణాన ఏమౌతుందోనని ప్రాణాలను గుప్పిట్లో పెట్టుకుని బ్రతుకున్నారు. ఘటనా స్థలికి చేరుకున్న అటవీ అధికారులు ఆ ప్రాంతాన్ని పరిశీలిస్తున్నారు.