యువతితో యువకుల అసభ్య ప్రవర్తన.. చితకబాదిన బాధితురాలి కుటుంబసభ్యులు..ఇరువర్గాలపై కేసు

యువతితో యువకుల అసభ్య ప్రవర్తన.. చితకబాదిన బాధితురాలి కుటుంబసభ్యులు..ఇరువర్గాలపై కేసు

చెన్నూరు, వెలుగు: ఓ యువతితో అసభ్యంగా ప్రవర్తించిన యువకులను బాధితురాలి కుటుంబభ్యులు చితకబాదారు.  కోటపల్లి మండలం బబ్బర్ చెల్కా కు చెందిన యువతి ఆదివారం తన కుటుంబసభ్యులతో కలిసి షాపింగ్ చేసేందుకు చెన్నూరు పట్టణానికి వచ్చింది.

 కొత్త బస్టాండ్​ఆవరణలో లింగన్నపేటకు చెందిన ఆటోడ్రైవర్​రఘు, అతని నలుగురు స్నేహితులు ఆమె డ్రెస్ పై కామెంట్స్ చేస్తూ అసభ్యంగా ప్రవర్తించారు. బాధితురాలు కుటుంబ సభ్యులు విషయం చెప్పడంతో వారు కోపంతో ఆ యువకులను చితకబాది, ఆటోను ధ్వంసం చేశారు. 

ఇరువర్గాలవారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. యువతితో అసభ్యంగా ప్రవర్తించినందుకు రఘు, శేఖర్, అంజన్న, శ్రీకాంత్, రఘుపై, చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని దాడి చేసినందుకు యువతి కుటుంబసభ్యులపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు.